బుల్లితెర స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్. అప్పుడప్పుడు వెండితెరపై కూడా కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. అలాంటిది కొద్దిరోజులుగా ప్రదీప్ టీవీ షోలలో కనిపించడం లేదు. ఉన్నట్టుండి 'ఢీ' షో నుంచి తప్పుకున్నాడు.అలానే 'కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా' షోకి కూడా రావడం లేదు.

దీంతో ప్రదీప్ కి ఏమైందంటూ సోషల్ మీడియాలో చర్చలు జరిగాయి. ప్రదీప్ ఆరోగ్యంపై రకరకాల ఊహాగానాలు బయలుదేరాయి. అతడి ఆరోగ్యం క్షీణించిందని ఇలా చాలా వార్తలు వినిపించాయి. తాజాగా ఈ విషయంపై ప్రదీప్ స్పందించాడు. తన సోషల్ మీడియా పేజ్ లైవ్ లో అభిమానులతో ముచ్చటించాడు.

మన బుల్లితెర యాంకర్లు వాడే కాస్ట్లీ కార్లు ఇవే..!

తన ఆరోగ్యానికి సంబంధించిన వస్తోన్న వార్తలపై పూర్తిగా క్లారిటీ ఇచ్చాడు. తన ఆరోగ్యం బాగాలేదని వార్తలు వచ్చిన తరువాత చాలా మంది అభిమానులు ఫోన్లు, మెసేజ్ లు చేసి అడుగుతున్నారని.. వారి ప్రేమకు నా ధన్యవాదాలు అని చెప్పాడు. ఇన్ని రోజులు షూట్ చేయలేకపోవడానికి గల కారణాలు చెప్పుకొచ్చాడు.

నెల రోజులుగా బ్రేక్ లో ఉన్నానని.. ఇప్పటివరకు ఇంత పెద్ద బ్రేక్ తీసుకోలేదని.. కానీ ఈసారి తప్పలేదని చెప్పాడు. సోషల్ మీడియాలో క్షీణించిన ఆరోగ్యం అంటూ తన గురించి పోస్ట్ లు పెట్టారని దాని వల్ల చాలా మంది కంగారు పడ్డారని చెప్పాడు. తను షోలకు దూరం కావడానికి అసలు కారణం ఏంటంటే.. తన కాలికి తగిలిన దెబ్బ అని చెప్పాడు ప్రదీప్.

 షూటింగ్ సమయంలో కాలికి గాయం తగిలిందని.. డాక్టర్స్ నిలుచుకూడదని చెప్పినా.. షూటింగ్ లో పాల్గొన్నానని దాంతో గాయం మరింత పెద్దదైందని చెప్పాడు. ఇక రెస్ట్ తీసుకోక తప్పలేదని.. మరో వరం రోజుల్లో మళ్లీ షోలు చేయడం మొదలుపెడతానని చెప్పారు. 

సినిమాల్లోకి రాకముందు మన స్టార్స్ ఏం చేసేవారో తెలుసా?