బుల్లితెర యాంకర్ ప్రదీప్.. ఇప్పుడు హీరోగా మారుతోన్న సంగతి తెలిసిందే. అతడు హీరోగా '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నాడు ప్రదీప్. అయితే సునిశిత్ అనే వ్యక్తి ప్రదీప్ కి పెద్ద షాక్ ఇచ్చాడు.

మేడ్చల్ జిల్లాకి చెందిన సునిశిత్ అనే దర్శకుడు ప్రదీప్ పై సంచలన ఆరోపణలు చేశారు. అమ్మాయిని వేధించిన కేసులో ప్రదీప్ ని రెండు రోజుల పాటు జైల్లో పెట్టారని.. సెంట్రల్ ఫిలిం బోర్డ్ రూల్స్ ప్రకారం ప్రదీప్ హీరోగా నటించడానికి అనర్హుడని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో సదరు దర్శకుడు కేసు పెట్టాడు.

యాంకర్ ప్రదీప్ కు షాక్.. కేసు నమోదుచేసిన యువకుడు, కారణం ఇదే!

ఈ విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు సునిశిత్ ఎవరు..? ప్రదీప్ పై కేసు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది..? అసలు ప్రదీప్ జైలుకి ఎప్పుడు వెళ్లాడు..? ఇలా రకరకాల ప్రశ్నలు తలెత్తాయి. దీంతో ఈ విషయంపై ప్రదీప్ స్పందించక తప్పలేదు. తాను జైలుకి వెళ్లినట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని.. వాటిని ఖండించాడు ప్రదీప్.

అసలు తనపై ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎవరో తనకు తెలియదని.. గతంలో తాను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీస్ కౌన్సెలింగ్ కి మాత్రమే వెళ్లానని క్లారిటీ ఇచ్చాడు. తనపై కావాలనే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. అసలు సునిశిత్ అనే దర్శకుడు పేరు మొదటిసారి వింటున్నానని.. తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దని ప్రదీప్ కోరారు.