యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. డబ్బుకు వెనుకాడకుండా 350 కోట్లు ఖర్చు చేసి తెరకెక్కించినప్పటికీ సాహో మూవీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఆ చేదు అనుభవాలని పక్కన పెట్టి ఈ ఏడాది అభిమానులకు ఓ మంచి చిత్రాన్ని అందించాలని ప్రభాస్ భావిస్తున్నాడు. 

సాహో షూటింగ్ దశలో ఉన్నప్పుడే ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి అనేక రకమైన టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. కానీ షూటింగ్ గురించి మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు. సాహో పూర్తయ్యాక ప్రభాస్ లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. 

ఎట్టకేలకు యువి క్రియేషన్స్ సంస్థ ప్రభాస్ 20వ చిత్ర షూటింగ్ అప్డేట్ అందించింది. రాధాకృష్ణ దర్శకత్వంలోని ప్రభాస్ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభమైనట్లు ప్రకటించారు. ఈ సంధర్భంగా ప్రభాస్ షూటింగ్ లొకేషన్ లో ఉన్న ఓ అద్భుతమైన పిక్ ని అభిమానులతో పంచుకున్నారు. ధగధగ మెరుపులతో, వింటేజ్ మోడల్ లో.. రాజభవనాన్ని తలపిస్తున్న ఓ భవనంలో ప్రభాస్ ఉన్నాడు. 

'రంగస్థలం'కి అందుకే అంత రేంజ్.. నాకిష్టమైన సినిమాలు ఆడలేదు: రవితేజ!

ప్రభాస్ చుట్టూ గోడలపై వివిధరకాల పాతకాలపు వస్తువులు, వ్యక్తుల దృశ్యాలు ఉన్న ఫోటోలు కనిపిస్తున్నాయి. ఈ మొత్తం సెటప్ సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా ఉంది. 1960 కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. 

ఈ చిత్రంలో ప్రభాస్ వింటేజ్ కార్ల వ్యాపారిగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఆ భవనం మధ్యలోప్రభాస్ నిలుచుని ఉన్న స్టిల్ అదిరిపోయింది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలియనున్నాయి.