బుల్లితెరపై యాంకర్ గా ఎన్నో షోలు చేసిన అనసూయ 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాతో నటిగా మారింది. ఆ తరువాత 'క్షణం' సినిమాతో తనకంటూ మార్కెట్ ఏర్పరచుకుంది. 'విన్నర్', 'ఎఫ్ 2' లాంటి చిత్రాలలో ఐటెం సాంగ్స్ లో నటించడంతో పాటు 'రంగస్థలం' సినిమాలో హీరో అత్తగా కనిపించి అందరినీ మెప్పించింది.

రామ్ చరణ్ తో కలిసి నటించిన అనసూయకి ఈసారి మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ ఇవ్వాలనుకున్నారు. చిరంజీవి హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తోన్న సినిమాలో అనసూయకి ఓ రోల్ ఇవ్వాలని భావించారు. కానీ ఇప్పుడు ఆ పాత్ర కోసం మరో నటిని తీసుకుంటున్నారట.

'అల్లు అర్జున్ గారు..' పవన్ స్పెషల్ మెసేజ్!

దీనికి కారణం నాగబాబు అని అంటున్నారు. చిరంజీవి సినిమాలో అనసూయకి ఛాన్స్ రాకుండా తెరవెనుక నాగబాబు చక్రం తిప్పాడనే ప్రచారం జరుగుతోంది. 'జబర్దస్త్' షో వదిలేసి.. 'అదిరింది' అనే కామెడీ షోకి జడిగా వెళ్లాడు నాగబాబు.

తను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 'అదిరింది' షోకి యాంకరింగ్ చేయమని నాగబాబు ముందుగా అనసూయని అడిగారట. దానికి ఆమె ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఆ కారణంగానే చిరంజీవి సినిమాలో అనసూయ కోసం అనుకున్న పాత్ర వేరే వాళ్లకి వెళ్లేలా చేశాడట నాగబాబు.

ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ప్రచారం చక్కర్లు కొడుతోంది.