యాంకర్ అనే పదానికి టాలీవుడ్ లో సరికొత్త అర్ధాన్ని చెప్పిన వారిలో అనసూయ ఒకరు. హాట్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ జబర్దస్త్ బ్యూటీ సినిమాల్లో కూడా చాలా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. పాత్రలను ఎంచుకోవడంలో కూడా ఈ భామ డిఫరెంట్ గా అడుగులు వేస్తోంది.

క్షణంలో అనసూయ చేసిన పాత్ర సినిమాకు మంచి బూస్ట్ ఇచ్చింది.  ఇక రంగస్థలం - కథనం సినిమాలు అనసూయకి  కెరీర్ కి మంచి ఇచ్చాయి. ప్రస్తుతం ఆమెకు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. ఇక ఎవరు ఉహించని విధంగా కృష్ణవంశీ తెరకెక్కించబోయే కొత్త సినిమాలో కూడా ఒక ప్రయోగాత్మకమైన పాత్రలో కనిపించిననున్నట్లు తెలుస్తోంది. కృష్ణవంశీ రంగమార్తాండ అనే సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే.

మరాఠి సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోన్న ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో కనిపించబోతున్నారు.   ఇక ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ లో రమ్యకృష్ణ నటిస్తుండగా అనసూయ కథను మలుపు తిప్పే ఒక సాధారణ మహిళగా కనిపించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే సినిమాకు సంబందించిన మరో స్పెషల్ అప్డేట్ వెలువడనుంది. అనసూయ పాత్ర సినిమాలో ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి. సీనియర్ సంగీత దర్శకులు ఇళయరాజా సంగీతం అందిస్తుండగా అభిషేక్ - మధు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు.

read also: హీరోల ఫస్ట్ రెమ్యునరేషన్,. ఇప్పుడేంత? (రూ.400 నుంచి 30కోట్లవరకు)