దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం ఘటనపై సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. కొందరు ప్రముఖులు దిశ తల్లితండ్రులను పరామర్శిస్తూ తమ సానుభూతి తెలుపుతున్నారు. అయితే ఈ విషయంలో అనసూయ ఇప్పటివరకు స్పందించలేదు.

పైగా ఎప్పటిలానే సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ బిజీగా గడుపుతోంది. ఈ విషయంలో నెటిజన్లు అనసూయని టార్గెట్ చేశారు. ఆమెపై విమర్శలు గుప్పించారు. దీంతో ఈ విషయంపై రియాక్ట్ అవుతూ హాట్ కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ. ఒక మనిషిగా కొన్ని సంఘటనలపై రియాక్ట్ అవుతానని చెప్పిన అనసూయ ప్రతీ దానికి కెమెరా పట్టుకొని రియాక్ట్ అవ్వాల్సిన పని లేదని చెప్పింది.

బాలు గారు ఫోన్ చేసి తిడుతున్నారు.. తమన్ కామెంట్స్

చాలా మంది సినీ పెద్దలు ఈ విషయంపై మాట్లాడారని.. వాళ్లకి చెప్పే పద్ధతి తెలుసు కాబట్టి మాట్లాడారని.. కానీ తను ఈ విషయంపై ఏం మాట్లాడాలో ప్రిపేర్ కాలేదని.. కానీ ఈరోజు తనను నమ్మేవాళ్ల కోసం మాట్లాడుతున్నట్లు చెప్పింది. దిశ ఘటనలో ఎంతో ఫీల్ అయినట్లు చెప్పిన అనసూయ.. అది కోపమా..?భయమా..? బాధ..? ఏంటో సరిగ్గా చెప్పలేనని.. ట్వీట్ పెట్టేసి చేతులు దులుపుకోలేననివెల్లడించింది.

సినిమా వాళ్లు చేసే ఎక్స్ పోజింగ్ వలన రేప్ లు జరుగుతున్నాయనికొందరు, రాత్రి పూట బ్యూటీ పార్లర్ కి వెళ్ళకుండా ఉంటే రేప్ జరగదు కదా.. అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారని.. వాటి స్క్రీన్ షాట్స్ చూపించి అందరినీ కడిగి పారేసింది.

అమ్మాయిలు ఎలా ఉండాలో డిసైడ్ చేయడానికిమీరెవరు..?  మీకేం హక్కు ఉందంటూ ప్రశ్నించింది. ఈ సంఘటన జరిగిన తరువాత చాలా భయం వేస్తుందని.. తనకు తెలిసిన మగాళ్లంటే కూడా భయం వేస్తుందని.. ఎవరిని నమ్మాలో తెలియడం లేదని అన్నారు. ఎవరికీ నచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నారని.. మహిళలు జాగ్రత్తగా ఉండాలని సలహాలు ఇస్తున్నారని.. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ప్లాన్ చేసి చంపేస్తుంటే ఏం చేయాలని ప్రశ్నించింది.