ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'. 'పెళ్లిచూపులు' దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. అవంతికా మిశ్రా హీరోయిన్ గా కనిపించనుంది. మరో ముఖ్య పాత్రలో అనసూయ కనిపించనుంది. గతంలో 'అర్జున్ రెడ్డి' సినిమా రిలీజైన సమయంలో అనసూయ.. విజయ్ దేవరకొండపై సంచలన కామెంట్స్ చేసింది.

సినిమా ప్రమోషన్స్ లో విజయ్ బూతులు వాడడంపై అనసూయ విమర్శలు గుప్పించింది. సోషల్ మీడియా వేదికగా విజయ్ పై మండిపడింది. అయితే విజయ్ మాత్రం అనసూయపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు కానీ రౌడీగారి ఫ్యాన్స్ మాత్రం ఊరుకోలేదు. అనసూయని ట్విట్టర్ లో ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు. అలాంటిది ఇప్పుడు విజయ్ దేవరకొండ నిర్మించిన 'మీకు మాత్రమే చెప్తా' సినిమాలో అనసూయ కీలకపాత్ర పోషించడంతో విషయం హాట్ టాపిక్ గా మారింది.

అప్పుడు అంతగా విజయ్ ని తిట్టిన అనసూయ ఇప్పుడు అతడి సినిమాలోనే నటించడంతో సినిమా ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ గురించి ఏం మాట్లాడుతుందో వినాలనే ఆసక్తి జనాలకు కలిగింది. తాజాగా విజయ్ ఇష్యూపై అనసూయ స్పందించింది. ఈ సినిమా కథ తనకు బాగా నచ్చిందని.. గతంలో జరిగిన విషయం తనపై కానీ విజయ్ పై కానీ ప్రభావం చూపించలేదని వెల్లడించింది.

'మీకు మాత్రమే చెప్తా' ట్రైలర్: 'నా కొడుకే నా వీడియో చూస్తే'..

కొత్త బ్యానర్ లలో నిర్మించే సినిమాల్లో నటించడం తన పాలసీకి విరుద్ధమని.. అయినా ఈ సినిమాలో నటించానని చెప్పుకొచ్చింది. తాజాగా మహేష్ బాబు చేతుల మీదుగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. అభినవ్ గోమటం, నవీన్ జార్జ్ థామస్, అనసూయ, వాణి భోజన్, పావని గంగిరెడ్డి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను నవంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ష‌మీర్ అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.