ఇటీవల జరిగిన 'ఆస్కార్' అవార్డుల ప్రదానోత్సవంలో దక్షిణ కొరియన్ సినిమా 'పారాసైట్'కి వివిధ కేటగిరీల్లో ఏకంగా నాలుగు అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ ప్లే, ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీల్లో 'పారాసైట్'కి నాలుగు అవార్డులు వచ్చాయి.

ఈ అవార్డులు వచ్చిన తరువాత ఈ సినిమా బాగా పాపులర్ అయింది. దీంతో ఈ సినిమాని చూడని వారు కూడా ఎక్కడుందో వెతుక్కొని మరీ చూశారు. ఈ క్రమంలో సినిమా చూసిన కొందరు కోలీవుడ్ అభిమానులు ఈ సినిమా విజయ్ సినిమాకి కాపీ అంటూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

‘పారాసైట్‌’కి 4 ఆస్కార్‌ లు, దేశంలో తొలి ఆస్కార్!

విజయ్ హీరోగా దర్శకుడు కేఎస్ రవికుమార్ 'మిన్సార కన్నా' అనే సినిమాని తెరకెక్కించారు. 'పారాసైట్' సినిమా 'మిన్సార కన్నా' సినిమాని పోలి ఉందని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు 'షాప్ లిఫ్టర్స్' అనే సినిమా ఛాయలు కూడా 'పారాసైట్' కనిపించినట్లు కొంతమంది నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే 'మిన్సార కన్నా' సినిమా హక్కులు తేనప్పన్ అనే నిర్మాత దగ్గర ఉండగా.. 'పారాసైట్' సినిమాపై ఆయన లీగల్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు ఓ ఇంటర్నేషనల్ లాయర్ తో ఆయన సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో త్వరలోనే 'పారాసైట్' దర్శకనిర్మాతలకు నోటీసులు ఇవ్వబోతున్నట్లు సమాచారం. అయితే ఈ ఏడాది ఎక్కువ ఆస్కార్ లు సాధించిన 'పారాసైట్'పై ఇలా కాపీ కామెంట్స్ రావడం హాట్ టాపిక్ గా మారింది.