ఎప్పుడూ ఏదో హంగామా చేస్తూ ట్రోలింగ్ కు గురి అవుతూంటుంది అమలాపాల్. మరీ ముఖ్యంగా వివాహబంధం నుంచి బయిట వచ్చిన దగ్గర నుంచీ తన ఇష్టం వచ్చినట్లు స్వేచ్చగా బ్రతుకుతున్నానంటూ సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో సందడి చేస్తోంది. అయితే అభిమానులు కొన్ని మెచ్చుకున్నా...ఆమెను చాలా సార్లు విమర్శిస్తూనే ఉంటున్నారు.

రీసెంట్ గా అలా మరోసారి దొరికిపోయింది అమలాపాల్. హాలోవిన్ డే సందర్బంగా ఆమె చేసిన హంగామాకు సంభందించిన ఫొటోలు భయపెట్టకపోగా..వికారం తెప్పిస్తున్నాంటూ ఆడుకుంటున్నారు. 31 అక్టోబర్ హాలోవిన్ డే..ని చాలా మంది స్టార్స్ లాగే అమలా పాల్ కూడా చేసుకుంది. బ్లాక్ జర్కిన్ వేసుకుని, కళ్లకు రెడ్ లిప్ స్టిక్ పెట్టుకుని,బుగ్గులకు కూడా రాసుకుంది. నాలుకని పార జాపి  ఫోజిచ్చింది.  

'V' మూవీ: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న నాని!

``ఇది సూపర్ హ్యాపీ హాలోవీన్`` అంటూ క్యాప్షన్ పెట్టి ఆ ఫొటోని షేర్ చేసింది. అయితే తన సరదా ఏదో తను చూసుకోక, ఇలా మీడియాలో షేర్ చేయటంతో ఫ్యాన్స్ కొందరు విదేశీ సంస్కృతిని ప్రచారం చేస్తున్నావంటూ తిట్టిపోస్తే, మరికొందరు ఉన్న అందమైన ముఖాన్ని చెడకొడుతున్నావ్ ఇలాంటి వాటితో అని ప్రేమగా తిట్టారు. వేరొకరు అయితే హాట్ దెయ్యం అంటూ విజిల్స్ వేసారు.

తను ఏం చేసినా ఏదో విధమైన విమర్శలు రావటం అమలాపాల్ కు  కొంతకాలంగా జరుగుతోందే. దాంతో ఈ విషయంలైట్ తీసుకున్నట్లు ఉంది..ఎటువంటి క్లాసులు పీకకుండా సైలెంట్ గా ఉంది. ఇక  అమలాపాల్ కెరీర్ విషయానికి వస్తే  ఈ మధ్యనే విడుదలైన ‘ఆమె’ సినిమా అంచనాలకు తగ్గట్లుగా లేకపోవటంతో వర్కవుట్ కాలేదు. టీజర్‌లో అమలాపాల్ ఆమె పూర్తిగా నగ్నంగా కనిపించి సినీ అభిమానుల మైండ్ బ్లాక్ చేసింది.

అయితే సినిమాలో అంత సీన్ లేదని తేలటంతో మొదటి రోజుకే థియోటర్స్ ఖాలీ అయ్యిపోయాయి. అలాగే అప్పుడు అమలాపాల్ తన సహనటి, వీజే రమ్యను ముద్దుపెట్టుకోవడమే చర్చనీయంగా మారింది.   హీరో, హీరోయిన్ల ముద్దు సీన్లు సాధారణమే కానీ, అమ్మాయిలను అమ్మాయిలు ముద్దుపెట్టుకునే సీన్లు లేకపోవటంతో హైలెట్ అయ్యింది కానీ అదీ కలిసి రాలేదు.