యంగ్ టాలెంటెడ్ హీరో నాని మరో డిఫరెంట్ సినిమాతో రావడానికి సిద్దమవుతున్నాడు. గత కొంత కాలంగా నాని సెలెక్ట్ చేసుకుంటున్న కథలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయనే చెప్పాలి. రెగ్యులర్ ఫార్మాట్ ని పక్కనపెట్టి డిఫరెంట్ లాజికల్ సినిమాలను చేస్తున్నాడు.

ఇటీవల జెర్సీ - గ్యాంగ్ లీడర్ అంటూ పాజిటివ్ టాక్ అందుకున్న నాని నెక్స్ట్ V అనే మరో సినిమాతో హిట్టు కొట్టాలని కష్టపడుతున్నాడు. తనకు లైఫ్ ఇచ్చిన మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని ఈ సినిమా చేస్తున్నాడు. ఇకపోతే సినిమా రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ వచ్చేసింది. సినిమాను ఉగాది కానుకగా 2020 మార్చ్ 25న రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

దిల్ రాజు ప్రొడక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. నాని కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిననున్నట్లు టాక్ వస్తోంది.  ఇక మరొక ముఖ్య పాత్రలో సుధీర్ బాబు నటిస్తున్నాడు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో కీలకమని తెలుస్తోంది.

ప్రస్తుతం సగం షూటింగ్ ని పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ వీలైనంత త్వరగా మిగతా వర్క్ ని కూడా ఫినిష్ చేయాలనీ కష్టపడుతున్నారు. ఇక సినిమాకు సంబందించిన స్పెషల్ అప్డేట్ ని త్వరలోనే రిలీజ్ చేయాలనీ దిల్ రాజు ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే సినిమా టీజర్ కూడా పై మరికొన్ని రోజుల్లో క్లారిటీరానుంది.  

ఇక నివేత థామస్ - అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందించనున్నాడు. ఈ సంగీత దర్శకుడు ఇంతకుముందు సైరా సినిమాకు మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. ఇక యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో నాని ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.