స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు, స్టార్ హీరో సోదరుడు అయినా... అల్లు శిరీష్ కు సినిమా కెరీర్ పరంగా చెప్పుకోదగ్గ హిట్ ఇప్పటికి ఒకటీ పడలేదు. శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు- కొత్త జంట లాంటి సినిమాలు మిన‌హా వేరే సినిమాలేవీ ఓ మాదిరిగా కూడా ఆడకపోవటం .. బావుంది అన్న టాక్ కూడా తెచ్చుకోక‌పోవ‌డం ఈ యంగ్ హీరో కెరీర్ పై ప్రభావం చూపించింది.

దానికి తోడు ఒక సినిమాకు మరో సినిమా మధ్య గ్యాప్ ఎక్కువ. అల్లు శిరీష్ నుంచి ఓ సినిమా వచ్చిందంటే, నెక్ట్స్ సినిమా మళ్లీ ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్దితి. అంత కుటుంబ సపోర్ట్ ఉండి కూడా నిలదొక్కుకోలకపోతున్నాడు. అందుకు కారణం అల్లు అర్జున్ లా కష్టపడకపోవటమే అంటారు.

హీరో నాని, త్రివిక్రమ్ సన్నిహిత ప్రొడక్షన్ హౌస్ పై ఐటీ దాడులు.. టాలీవుడ్ కు వరుస షాక్ లు!

దాంతో కథ హీరోగా భావించే సినిమాలతోనే శిరీష్ తన లక్ ని పరీక్షించుకోవాల్సి వస్తోంది. ఈ నేపధ్యంలో అల్లు శిరీష్ కెరీర్ ముగిసిన‌ట్టేనా? అన్న టాక్ వినపడతోంది. ఈ నేపధ్యంలో తాజాగా  ఓ కొత్త క‌బురు చెప్పి షాకిచ్చాడు. 2020లో రెండు రిలీజ్ లు ఉంటాయ్! అని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

అందుతున్న సమాచారం ప్రకారం...ఓ తమిళ రీమేక్ లో అల్లు శిరీష్ చేయటానికి రంగం సిద్దంమైందని సమాచారం. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందే ఈ తమిళ రీమేక్ చిత్రం పేరు ‘ప్యార్ ప్రేమ కాదల్’ .  తమిళ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా నిర్మాతగా తెరకెక్కించారు.

తమిళంలో మాంచి విజయం సొంతం చేసుకున్న ఈ సినిమాను డబ్బింగ్ చేసి తెలుగులో దర్శక నిర్మాణ తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో యువన్ శంకర్, విజయ్ మొర్వనేని సంయుక్తంగా విడుదల చేద్దామని ప్లాన్ చేసారు.  

డబ్బింగ్ చేసి  ట్రైలర్‌‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. అయితే ఈ సినిమాని రీమేక్ చేస్తే బాగుంటుందని అల్లు అరవింద్ భావించటంతో రిలీజ్ ఆపేసి, అల్లు శిరీష్ తో ట్రై చేస్తున్నారట. దర్శకుడు మెగా క్యాంప్ కు చెందిన వాడుని చెప్పుకుంటున్నారు. ఎవరనేది తెలియలేదు.