టాలీవుడ్ లో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థల్లో గీతాఆర్ట్స్ ఒకటి. ఇప్పటివరకు మెగాఫ్యామిలీ హీరోలతో సినిమాలు చేసిన ఈ సంస్థ ఇప్పుడిప్పుడే బయట హీరోలతో కూడా సినిమాలు చేయడం మొదలుపెట్టింది.

ఈ క్రమంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తుంది. మహేష్ కూడా గీతాఆర్ట్స్ లో సినిమా చేయడానికి అంగీకరించాడు. దీంతో నిర్మాత అల్లు అరవింద్.. మహేష్ కోసం కథలు వెతికే పనిలో పడ్డాడు. ఈ నేపధ్యంలో 'గీత గోవిందం' లాంటి హిట్ సినిమా తీసిన దర్శకుడు పరశురాంతో మహేష్ సినిమా సెట్ చేయాలని భావించారు.

లావణ్య త్రిపాఠి, సుమ, అనసూయ ఇళ్లలో జీఎస్టీ సోదాలు..కారణం ఇదే

ఈ మేరకు పరశురాం.. మహేష్ ని కలిసి కథ కూడా వినిపించారు. అయితే ఆ కథ మహేష్ కి పెద్దగా నచ్చలేదు. దీంతో పరశురాం కొన్ని మార్పులు చేర్పులు చేసి మరోసారి వినిపించాడు. అప్పటికీ మహేష్ తృప్తి చెందకపోవడంతో ఇప్పుడు అల్లు అరవింద్.. మహేష్ కోసం మరో దర్శకుడిని వెతికే పనిలో పడ్డారు.

బన్నీ వాసు, యువి క్రియేషన్స్ తో కలిసి మహేష్ కోసం కథలు వింటున్నారు. సరైన కథ దొరికితే అప్పుడు మహేష్ కి వినిపించాలని అనుకుంటున్నారు. కొందరు తమిళ దర్శకులను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరి మహేష్ కోసం ఏ డైరెక్టర్ ని ఫైనల్ చేస్తారో చూడాలి. ఫ్యాన్స్ మాత్రం మహేష్ బాబు, గీతాఆర్ట్స్ కాంబినేషన్ లో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు!