స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం అల వైకుంఠపురములో. మతాల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. సంక్రాంతికి విడుదల కాబోతున్న మరో చిత్రం మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు. ఈ రెండు చిత్రాల మధ్య పోటీ ఆసక్తి రేపుతోంది. 

అల్లు అర్జున్ చిత్రం అంటే పాటలకు, డాన్సులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇప్పటికే తమన్ సంగీతం అందించిన అల వైకుంఠపురములో సాంగ్స్ యూట్యూబ్ లో దుమ్మురేపుతున్నాయి. సామజవరగమన, రాములో రాములా పాటలు 100 మిలియన్ల మార్క్ దాటేశాయి. ఇటీవల విడుదలైన 'బుట్టబొమ్మ' సాంగ్ కూడా శ్రోతల్ని ఆకట్టుకుంటోంది. 

ఈ పాట చిత్రీకరణ ప్రేక్షకులని థ్రిల్ చేసే విధంగా ఉంటుందట. అల్లు అర్జున్ స్టెప్పులతో పాటు, ప్రత్యేకంగా తెప్పించిన పూల అలంకరణతో కూడిన సెట్ ఈ సాంగ్ లో హైలైట్ గా నిలవనునట్లు తెలుస్తోంది. 

నా పేరు సూర్య లాంటి డిజాస్టర్ చిత్రం తర్వాత బన్నీ నుంచి వస్తున్న చిత్రం కావడంతో అల వైకుంఠపురములో పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి జోడిగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే డీజే చిత్రంలో ఈ జంట కనువిందు చేశారు. 

పిచ్చెక్కించేలా 'రంగస్థలం' బ్యూటీ ఫోజులు.. ఓ లుక్కేయండి!

అల వైకుంఠపురములో చిత్రాన్ని 1958లో ఎన్టీఆర్, సావిత్రి నటించిన ఇంటిగుట్టు మూవీ కథాంశంతో తెరక్కిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. త్రివిక్రమ్ ఇప్పటికే మీనా చిత్ర కథాంశంతో రూపొందించిన అ.. ఆ చిత్రంతో మ్యాజిక్ చేశారు. మరి అల వైకుంఠపురములో చిత్రం ఎలా ఉండబోతోందో వేచి చూడాలి. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ధనవంతుడికి కొడుకుగా జన్మించి.. అతడి కారు డ్రైవర్ ఇంట్లో పెరుగుతాడట.