మెగా మేనల్లుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ అల్లు అర్జున్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు, క్రేజ్ సొంతం చేసుకున్నాడు. డాన్సులు, పెర్ఫామెన్స్, ఫైట్స్ ఇలా ప్రతి ఒక్క అంశాల్లో బన్నీ పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. ఈ సంక్రాంతికి అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రం విడుదల కాబోతోంది. దీనితో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టింది. 

సోమవారం రోజు నిర్వహించిన మ్యూజికల్ కన్సర్ట్ గ్రాండ్ సక్సెస్ అయింది. త్వరలో అల్లు అర్జున్ టీవీ ఇంటర్వ్యూలకు కూడా రెడీ అవుతున్నాడు. అల వైకుంఠపురములో చిత్ర పాటలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ అభిమానుల సందడి సాధారణంగానే ఉంటుంది. 

అల వైకుంఠపురములో చిత్ర రిలీజ్ సందర్భంగా కేరళలో కూడా బన్నీ ఫ్యాన్స్ హంగామా మొదలుపెట్టేశారు. కేరళలో ఈ చిత్రం 'అంగు వైకుంఠపరుతు' పేరుతో రిలీజ్ కానుంది. కేరళలోని వివిధ పట్టణాల్లో అల్లు అర్జున్ అభిమానులు అల వైకుంఠపురములో చిత్ర పోస్టర్స్ విడుదల చేసి సినిమాకు ప్రచారం ప్రారంభించారు. 

కేరళలో అల్లు అర్జున్ కు విశేషమైన ఫాలోయింగ్ ఉంది. అక్కడ కూడా బన్నీ చిత్రాలకు మంచి మార్కెట్ ఉంది. త్వరలో కేరళలో కూడా ఈ చిత్ర ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. 

బండ్ల గణేష్ నెక్స్ట్ టార్గెట్ అదేనా.. పబ్లిక్ గా కామెంట్స్!

పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో మురళీశర్మ, టబు, సుశాంత్, నివేత పేతురాజ్ కీలక పాత్రల్లో నటించారు. తమన్ సంగీత దర్శకుడు. అల్లు అరవింద్, రాధాకృష్ణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. 

చాలా మంది మా నాన్న డబ్బులు కొట్టేశారని అంటారు.. స్టేజ్ పై ఏడ్చేసిన అల్లు అర్జున్!