కరోనా ఎఫెక్ట్ తో ఇళ్లకే పరిమితమైన సినీ ప్రముఖులు తమదైన స్టైల్‌ అభిమానులను అలరిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది స్టార్స్‌ తమ వర్క్ అవుట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను ఉత్సాహ పరుస్తున్నారు. పలువురు హీరోయిన్లు కూడా ఇలాంటి వీడియోలతో ఆకట్టుకుంటుంటగా తాజాగా స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ ఆసక్తికర వీడియోను సోషల్ మీడియా పేజ్‌ లో పోస్ట్ చేశాడు.

ఇప్పటికే అభిమానులను జనతా కర్ఫ్యూతో పాటు లాక్ డౌన్‌కు ప్రజలు సహకరించాలి అంటూ వీడియో సందేశాలను విడుదల చేసిన పూరి, తాజాగా ఓ ఫన్నీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. `మీకు ఇక బోర్ ఫీల్ అవ్వరు. ఇంట్లోనే ఇలా హర్స్‌ రైడింగ్ చేయండి. మీరు ఎంటర్‌టైన్‌ అవుతారు` అంటూ కామెంట్ చేశాడు. పూరి పోస్ట్ చేసిన కొద్ది సేపటికే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇటీవల ఇస్మార్ట్ శంకర్‌ సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ హీరోగా ఓ మల్టీ లింగ్యువల్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్‌ తో కలిసి పూరీ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాతో పాటు తన తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీగా ఉంది.
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Hi Guys, You won’t get bored sitting at home. Do some Horse Riding indoors to keep yourself entertained 👇🏽

A post shared by Puri Jagannadh (@purijagannadh) on Mar 23, 2020 at 11:43pm PDT