మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హ్యాట్రిక్ కాంబోలో తెరకెక్కిన చిత్రం అల వైకుంఠపురములో. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అల్లు అర్జున్, పూజా హెగ్డే డీజే తర్వాత మరోసారి రొమాన్స్ చేస్తున్న చిత్రం ఇది. 

ఇప్పటికే విడుదలైన సాంగ్స్ సినిమాపై అంచనాలని అమాంతం పెంచేశాయి. టీజర్, ట్రైలర్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. విడుదల సమయం దగ్గర పడేకొద్దీ ఈ చిత్రానికి సంబంధించిన ఒక్కో విశేషం బయటకు వస్తోంది. ఈ చిత్రంలో బుట్టబొమ్మ సాంగ్ చిత్రీకరణ పరంగా ప్రధాన ఆకర్షణగా నిలవనుందట. 

పూజా హెగ్డే గ్లామర్ తో పాటు.. అల్లు అర్జున్ డాన్స్ మూమెంట్స్ అద్భుతంగా ఉంటాయని అంటున్నారు. ఈ సాంగ్ లో అల్లు అర్జున్ వేసే హుక్ స్టెప్ ట్రెండ్ సెట్ చేసే విధంగా ఉంటుందని టాక్. ఎప్పటిలాగే బన్నీ డాన్స్ తో మెస్మరైజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ చిత్రాల్లో కథనంతో పాటు పాటల చిత్రీకరణ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. తమన్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే సంచలనం సృష్టిస్తున్నాయి. 

న్యూడ్ ఫోటోలు అమ్ముతున్న మోడల్.. రూ.5 కోట్ల కలెక్షన్, ప్రశంసల వర్షం!

ఈ చిత్ర కథని దర్శకుడు త్రివిక్రమ్.. ఎన్టీఆర్, సావిత్రి నటించిన ఇంటిగుట్టు ఆధారంగా రూపొందించారని టాక్. ఇంటిగుట్టు చిత్రంలో లాగే అల వైకుంఠపురములో కూడా అల్లు అర్జున్, సుశాంత్ లు కన్న తల్లిదండ్రుల వద్ద కాకుండా మరొకరి వద్ద పెరుగుతారని సమాచారం. ఆ క్రమంలో అల్లు అర్జున్ మధ్యతరగతి ఫ్యామిలీలో పెరుగుతాడట. ఈ చిత్ర కథ ఇదేనా లేక త్రివిక్రమ్ ఇంకేమైనా మార్పులు చేశారా అనేది వేచి చూడాలి.