సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా ఎనౌన్స్ చేసి చాలా కాలం అయ్యిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటిదాకా ప్రాజెక్టు ప్రారంభం కాలేదు. అందుకు కారణం కథ విషయంలో బన్ని కాంప్రమైజ్ కాకపోవటమే అని అన్నారు. శేషాచలం ఫారెస్ట్ లోని ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఆ కథ రెడీ చేసారు. అయితే అందులో హీరోయిన్ థ్రెడ్ కరెక్ట్ గా సెట్ కాలేదని చెప్పుకున్నారు.

చరణ్ ని చంపేసి.. తారక్ తో లేచిపోతా: కాజల్

దాంతో ఈ కథకు కొన్ని మార్పులు చెప్పటంతో, దానిపై సుకుమార్ వర్క్ చేసారు. అయితే సుకుమార్ చేసిన ఆ మార్పులు అల్లు అర్జున్ కు పెద్దగా నచ్చలేదట. దాంతో సుకుమార్ తన దగ్గర ఉన్న ఫ్రెష్ లవ్ స్టోరీ ...  లైన్ ని చెప్తే, దాన్ని ఓకే చేసి పూర్తి స్క్రిప్టు గా రెడీ చేయమన్నారు. కానీ పూర్తి స్క్రిప్టు విన్న బన్ని ...ఈ కథ తన ఇమేజ్ కు సరిపోయేది కాదని,  చాలా చిన్నది అవుతుందని, తన కెరీర్ ప్రారంభ రోజుల్లో చేయాల్సిన కథ ఇది అని, మొదట చెప్పిన ఆ ఎర్ర చందనం కథతోనే ముందుకు వెళ్లాదమని అన్నారట. ఈ సినిమాలో ఎక్కువ భాగం చిత్తూరు, నెల్లూరు దగ్గరలో నల్లమల ఫారెస్ట్ లో జరగనుందట.

అయితే ఆ కథ ఇంతకు ముందులా పూర్తి యాక్షన్ స్టోరీ కాదని, ఓ  రొమాంటిక్ లవ్ స్టోరీ కూడా కలపాలని తెలుస్తోంది. అయితే పాయింట్ లోనే చాలా విభిన్నతతో కూడిన లవ్ స్టోరీ కావటం, బ్యాక్ డ్రాప్ ఇప్పటిదాకా రానిది కావటంతో బన్ని ఇంప్రెస్ అయ్యినట్లు చెప్పుకుంటున్నారు. రీసెంట్ గా ఫైనల్ నేరేషన్ విన్న అల్లు అర్జున్ ..సుకుమార్ కు ఓ చిన్న మార్పు సూచించాడని, దానిపై టీమ్ పనిచేస్తోంది. మరో ప్రక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఫస్ట్ షెడ్యూల్ కోసం ఓ భారీ సెట్ వేయిస్తున్నారు.

మరో ప్రక్క అల్లు అర్జున్ తన తాజా చిత్రం అల వైకుంఠపురములో సినిమా పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. పూజ హెడ్గే, నివేదిత పేతు రాజ్ హీరోయిన్స్ గా చేస్తున్న  ఈ సినిమా సంక్రాంతికి విడుదలకు సిద్దమవుతోంది. మాజీ హీరోయిన్ టబు ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే విడుదలైన సామజవరగమన పాట పెద్ద హిట్ అయ్యింది.