టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటూ దాదాపు స్టార్ హీరోలందరితో నటించిన బ్యూటీ కాజల్ అగర్వాల్. టాలీవుడ్ చందమామ అంటూ తనకంటూ ఒక స్పెషల్ బ్రాండ్ ఇమేజ్ ని కూడా సెట్ చేసుకుంది. అయితే రీసెంట్ గా కాజల్ స్టార్ హీరోలపై చేసిన బోల్డ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటానని చరణ్ ని చంపేసి తారక్ తో లేచిపోతానని ఎవరు ఊహించని విధంగా కామెంట్ చేసింది.  గతంలో ఎప్పుడు లేని విధంగా ఇటీవల మంచు లక్ష్మి ఫీట్ అప్ విత్ ది స్టార్స్ అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే షోకి గెస్ట్ లుగా వచ్చిన స్టార్స్ ఏ మాత్రం ఆలోచించకుండా సరదాగా ఇతర స్టార్స్ పై బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు.

ముఖ్యంగా స్టార్ హీరోలపై స్పెషల్ క్రష్ ని చూపిస్తున్నారు. ఇటివల కాజల్ కూడా అదే డోస్ లో వివరణ ఇచ్చి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యేలా చేసింది.  పెళ్లి ఎవరిని చేసుకుంటారు? ఎవరితో జంప్ అవుతారు? అలాగే ఎవరిని చంపేస్తారు అని మంచు లక్ష్మి అడిగిన ప్రశ్నకు కాజల్ సిగ్గుపడుతూ కౌంటర్ ఇచ్చింది. ప్రభాస్ కి పెళ్లి కాలేదు కాబట్టి అతన్ని పెళ్లి చేసుకుంటా! తారక్ ని చూస్తే లేచిపోవాలని అనిపిస్తుంది.

ఇక రామ్ చరణ్ ని చంపేస్తానని కాజల్ సరదాగా కామెంట్ చేసింది. త్వరలో ఆ షో డిజిటల్ మీడియా వూట్ లో ప్రసారం కానుంది. టీజర్ లోనే ఇంతగా రచ్చ చేసిన అమ్మడు ఫుల్ ఎపిసోడ్ లో ఇంకెన్ని కామెంట్స్ చేసిందో..?  ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 సినిమాలో మెయిన్ లీడ్ లో నటిస్తోన్న కాజల్ పలు తెలుగు సినిమాల్లో కూడా నటించడానికి ఒప్పుకుంది.