అల వైకుంఠపురములో చిత్రంతో అల్లు అర్జున్ ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాదు.. నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శత్వంలో నటిస్తున్నాడు. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా బన్నీ తన రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర సంగతులు తెలిపాడు. అల వైకుంఠపురములో చిత్రానికి అల్లు అరవింద్ కూడా ఓ నిర్మాత. కాబట్టి బన్నీ రెమ్యునరేషన్ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోవచ్చని అనుకోవచ్చు. కానీ అలాంటిదేమీ లేదని వృత్తి పరంగా పకడ్బందీగా ఉంటానని అంటున్నాడు. 

ఆ మధ్యన అల వైకుంఠపురములో సక్సెస్ ఈవెంట్ లో కూడా బన్నీ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. మా నాన్న మనీ విషయంలో పక్కాగా ఉంటారని తెలిపాడు. ఈ సారి తనగురించి చెప్పుకొచ్చాడు. నిర్మాత మా నాన్న అయినప్పటికీ రెమ్యునరేషన్ విషయంలో నాకు ఎలాంటి మొహమాటం లేదు.

బికినీలో నితిన్ హీరోయిన్.. గుండెజారి గల్లంతవ్వాల్సిందే! 

నాకు రావాల్సిన రెమ్యునరేషన్ నేను తీసుకున్నా. నాన్నకు, నాకు మధ్య రెమ్యునరేషన్ గురించి మాట్లాడడానికి ఓ మీడియేటర్ ఉన్నాడు. అతడే బన్నీ వాసు. బన్నీ వాసు కూడా నా రెమ్యునరేషన్ కఠినంగా ఉంటాడు. నాన్నగారితో నా రెమ్యునరేషన్ గురించి చాలా నేరసారాలే జరిగాయి అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు.