అల్లు అర్జున్ వర్సెస్ మహేష్ బాబు సినిమాల మధ్య మొదటిసారి జరుగుతున్న బాక్స్ ఆఫీస్ ఫైట్ ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. ఈ ఇద్దరి హీరోల సినిమాలు సంక్రాంతి కి డేట్ ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. నిన్నటివరకు ఈ ఫైట్ పై ఎన్నో రూమర్స్ వినిపించాయి. ఒకేరోజు రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడనున్నాయి అంటే అది మాములు విషయం కాదు.

అల్లు అర్జున్ అల.. వైకుంఠపురములో - మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు.. ఈ రెండు సినిమాలు దేనికవే ప్రత్యేకం. రెండు చిత్రాలు జనవరి 12న రిలీజ్ తేదీని ఫిక్స్ చేసుకున్నాయి.  అయితే ఇప్పుడు నిర్మాతలు మరో కొత్త నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మొదట మహేష్ బాబు సినిమా వచ్చిన తరువాత బన్నీ సినిమా రిలీజ్ అయ్యేలా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

రెండు సినిమాల మద్యం కనీసం ఒక్కరోజైనా గ్యాప్ ఉండాలని ఓ వైపు డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కూడా అభ్యర్థనలు వస్తున్నాయి. పైగా అభిమానుల మధ్యన కూడా వాతావరణం సీరియస్ గా మారే అవకాశం లేకపోలేదు. సో ఇవన్నీ అలోచించి నిర్మాతలు దిల్ రాజు - అల్లు అరవింద్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు టాక్.  

మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాను జనవరి 11న రిలీజ్ చేసి.. అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురములో.. చిత్రాన్ని జనవరి 13న రిలీజ్ చేయాలనీ ఇరు నిర్మాతలు ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే థియేటర్స్ విస్తరణ విషయంలో మనస్పర్థలు తగ్గే అవకాశం ఉందని చెప్పవచ్చు.  

త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న బన్నీ ప్రాజెక్ట్ ను అల్లు అరవింద్ - చినబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక మహేష్ సరిలేరు నీకెవ్వరు కూడా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమాకు సంబందించిన షూటింగ్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఆ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.