మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరూ టాలీవుడ్ లో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు. ఇద్దరూ మెగా ఫ్యామిలీ నుంచి రావడంతో కొంత వరకు కామన్ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ రామ్ చరణ్, అల్లు అర్జున్ ఎవరి స్థాయిలో వారి తన నటనలో ప్రతిభకనబరుస్తూ ప్రత్యేకమైన అభిమానులని సొంతం చేసుకున్నారు. 

ప్రస్తుతం సోషల్ మీడియాలో రామ్ చరణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య పెద్ద ఫైటే జరుగుతోంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ రామ్ చరణ్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుకు కారణం ఉంది. అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. 

ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాదు.. టాలీవుడ్ లో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దీనితో బన్నీకి చిత్ర పరిశ్రమ నుంచి ప్రశంసలు దక్కాయి. ఇదిలా ఉండగా రామ్ చరణ్ తరచుగా తన ఫేస్ బుక్ పేజీలో ఇటీవల విడుదలవుతున్న చిత్రాలని, నటీ నటుల్ని అభినందిస్తున్నాడు. 

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కు షాక్ ఇవ్వబోతున్న డైరెక్టర్.. నోటీసులు ?

కానీ అల వైకుంఠపురములో లాంటి ఘనవిజయం సాధించిన చిత్రం గురించి చరణ్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం బన్నీ ఫాన్స్ ఆగ్రహానికి కారణం అవుతోంది. ఇటీవల జాను చిత్రం గురించి కూడా రామ్ చరణ్ స్పందించాడు. దీనితో రామ్ చరణ్ వైఖరిపై బన్నీ ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. 

చిరంజీవి, సురేఖ పెళ్లి చూపులు అలా జరిగాయి.. మెగాస్టార్ అహం దెబ్బతినిందట!

కానీ రామ్ చరణ్ పర్సనల్ గా బన్నీకి అభినందనలు చెప్పి ఉండొచ్చు కదా అనే మెగా పవర్ స్టార్ అభిమానుల వాదన. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శత్వంలో నటిస్తున్నాడు. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.