యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం భీష్మ చిత్ర సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అ..ఆ తర్వాత విజయాల్లేక ఇబ్బంది పడుతున్న నితిన్ భీష్మ చిత్రంతో సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. స్వర సాగర్ సంగీతం అందించారు. 

రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన భీష్మ చిత్రం గత శుక్రవారం విడుదలై ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. భీష్మ చిత్రానికి వసూళ్లు కూడా అదిరిపోతున్నాయి. దీనితో భీష్మ చిత్ర యూనిట్ కి సెలెబ్రిటీల నుంచి కూడా అభినందనలు అందుతున్నాయి. 

తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భీష్మ చిత్రయూనిట్ కి కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ లో బన్నీ నితిన్ పెళ్లి గురించి కూడా ప్రస్తావించాడు. 'నితిన్ కి డబుల్ కంగ్రాట్స్. ఇప్పుడు మ్యారేజ్ సెలెబ్రేషన్స్ మరింత జోష్ తో జరుగుతాయి. చాలా మంచి తరుణంలో నితిన్ కు శుభం జరిగింది. నీ పట్ల సంతోషంగా ఉన్నా. భీష్మ చిత్ర యూనిట్ మొత్తానికి ఇవే నా అభినందనలు. 

మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు వెంకీ కుడుముల గారికి శుభాకాంక్షలు. ఈ చిత్రంలో రష్మిక ఆల్ రౌండర్ పెర్ఫామెన్స్ అందించింది. చిత్ర నిర్మాత నాగ వంశీ వరుస విజయాలు అందుకుంటున్నారు. మరోసారి భీష్మ టీంకు కంగ్రాట్స్' అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. 

మహేష్ తో గొడవ, నాకు ఛాన్సుల్లేవంటే నవ్వుతారు.. ప్రకాష్ రాజ్ కామెంట్స్!

భీష్మ చిత్ర రిలీజ్ కు కొన్ని రోజుల ముందు నితిన్ పెళ్లి పనులు ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ లో నితిన్ తన ప్రేయసి షాలినిని వివాహం చేసుకోబోతున్నాడు. భీష్మ విజయం సాధించడం నితిన్ జీవితంలోకి అమ్మాయి వచ్చిన వేళా విశేషం అని అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు.