ఇటీవలి కాలంలో తరచూ వినిపిస్తోన్న మాట నెపోటిజం (బంధుప్రీతి). బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు నెపోటిజంపై భారీగా చర్చ సాగుతోంది. పరిశ్రమలో బంధుప్రీతి ఎక్కువని, టాలెంట్ లేకున్నా స్టార్ కిడ్స్‌కు అవకాశాలు పదిలంగా ఉంటాయన్న వ్యాఖ్యలు ఇటీవలి కాలంలో బలంగా వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఈ విషయంలో చాలా మంది హీరోలు స్పందించారు. గతంలో నాగార్జున, రానా లాంటి హీరోలు దీనిపై మాట్లాడారు. టాలెంట్ లేకపోతే.. స్టార్ కిడ్స్ కి కూడా ఫ్యూచర్ ఉండదని వారు చెప్పారు. తాజాగా ఈ విషయంపై హీరో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

నవదీప్ కోసమే మా ఆవిడ ప్యారిస్ వచ్చింది : త్రివిక్రమ్!

త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ హీరోగా 'అల.. వైకుంఠపురములో' అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఆదివారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలిషో నుండే హిట్ టాక్ ని దక్కించుకుంది. తొలిరోజు ఈ సినిమా రూ.45 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. దీంతో చిత్రబృందం తాజాగా సినిమా థాంక్స్ మీట్ ని ఏర్పాటు చేసింది. ఇందులో అల్లు అర్జున్ నెపోటిజంపై కొన్ని కామెంట్స్ చేశారు. 

ఒకే ఫ్యామిలీ నుండి వరుసగా హీరోలు రావడం.. ఇండస్ట్రీని హైజాక్ చేస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయని దానికి నెపోటిజం అనే ఒక నెగెటివ్ పేరుందని అన్నారు. దీనికి ఉదాహరణ చెబుతూ.. ''ఒక పూజారి తన జీవితం మొత్తం దేవుడికి అంకితం చేశాడు.. వాళ్ల కొడుకు కూడా చేశాడు.. వాళ్ల మనవడు చేశాడు.. మేం కూడా ప్రేక్షక దేవుళ్లకు జీవితం అంకితం చేస్తున్నాం.. మా తాత చేశాడు..మా నాన్న చేశాడు.. నేను కూడా చేస్తున్నా.. ఇది నెపోటిజం అనుకుంటే 'యస్'.. మేం ఉన్ననంత కాలం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం..'' అంటూ చెప్పుకొచ్చాడు బన్నీ.