స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, బన్నీ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్ర పాటలు సంచలనం సృష్టించాయి. భారీ అంచనాల నడుమ అల వైకుంఠపురములో చిత్రం జనవరి 12న రిలీజ్ కాబోతోంది. 

మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. అల వైకుంఠపురములో చిత్రానికి ఇంతటి బజ్ ఏర్పండిందంటే అందులో సంగీత దర్శకుడు తమన్ క్రెడిట్ ఎంతైనా ఉంది. ఈ చిత్రానికి తమన్ ఆణిముత్యాల్లాంటి సాంగ్స్ అందించాడు. యూట్యూబ్ లో ఒక్కో సాంగ్ మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. 

అతడితోనే నా పెళ్లి.. ఆ టైంలోనే ఫిక్స్ అయ్యా.. బిగ్ బాస్ భానుశ్రీ కామెంట్స్

ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో బన్నీ, త్రివిక్రమ్.. తమన్ గురించి చర్చించుకున్నారు. త్రివిక్రమ్ చిత్రాల్లో సాహిత్యానికి పెద్ద పీట ఉంటుంది. ఆయనతో కలసి పనిచేయమని తమన్ కు రేసుగుర్రం మూవీ టైం లో సలహా ఇచ్చా. నాకు కూడా ఆయనతో కల్సి వర్క్ చేయాలనీ ఉంది బ్రదర్ కానీ పిలవడం లేదు అని తమన్ చెప్పాడు. 

ఎట్టకేలకు ఎన్టీఆర్ అరవింద సమేత చిత్రంతో తమన్ కు ఆ ఛాన్స్ వచ్చింది. ఆ విషయాన్ని తమన్ నాతో షేర్ చేసుకున్నాడు. మంచి సినిమా చేస్తున్నావు బ్రదర్.. ఆల్ ది బెస్ట్ అని చెప్పా. ఆ మూవీలో 'పెనివిటి' సాంగ్ కు అద్భుతమైన సంగీతం అందించాడని బన్నీ ప్రశంసించాడు.