చాలా కాలంగా నందమూరి మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం గురించి వార్తలు వస్తున్నాయి. కానీ ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు మాత్రం కనిపించడం లేదు. తరచుగా బాలయ్యకు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ప్రశ్నలు ఎదురవుతున్నప్పటికీ స్పష్టమైన సమధానం ఇవ్వకుండా దాటవేస్తూ వచ్చాడు. దీనితో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ కు ఎదురుచూపులు తప్పడం లేదు. 

అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఫొటోస్ మినహా మోక్షజ్ఞ అభిమానులకు కనిపించింది లేదు. ఆ మధ్యన బాలయ్య మోక్షజ్ఞ కోసం దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మోక్షజ్ఞకు నటనపై ఆసక్తి లేదని, వ్యాపారాలు చేసే అవకాశం ఉందని అనేక పుకార్లు వినిపించాయి. దీనితో నందమూరి అభిమానుల్లో మరింతగా కలవరం పెరిగింది. 

రేణుదేశాయ్ కోసం ఇల్లు కొన్న పవన్ కళ్యాణ్..?

తాజాగా నందమూరి ఫ్యాన్స్ ని ఖుషీ చేసే వార్త బయటకు వచ్చింది. నందమూరి మోక్షజ్ఞ త్వరలో న్యూయార్క్ బయలుదేరనున్నట్లు తెలుస్తోంది. నటనలో శిక్షణ కోసమే మోక్షజ్ఞ న్యూయార్క్ బయలుదేరుతున్నట్లు సమాచారం. న్యూయార్క్ ఫిలిం అండ్ థియేటర్ ఇన్స్టిట్యూట్ లో మోక్షజ్ఞ మూడు నెలల పాటు శిక్షణ పొందనున్నట్లు సమాచారం. 

శిక్షణ పూర్తి కాగానే మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం ఈ ఏడాదే ఉండబోతున్నట్లు టాక్. ఇప్పటికే బాలయ్య కొందరు క్రేజీ డైరెక్టర్స్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నందమూరి ఫ్యామిలిలో బాలయ్య, జూ.ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లు యాక్టివ్ గా సినిమాల్లో నటిస్తున్నారు.