గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న వారిలో అల్లు అరవింద్ ఒకరు. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా పలు సినిమాలను నిర్మించారు. ఇక ఇండస్ట్రీలో ఆయన స్థాపించిన గీత ఆర్ట్స్ కి మంచి బ్రాండ్ సెట్టయ్యింది. గీత ఆర్ట్స్ నుంచి ఒక సినిమా వస్తోంది అంటే సినిమా ఇండస్ట్రీలో మిగతా సినిమాల వాళ్ళు కాస్త రిలీజ్ డేట్ విషయంలో సర్దుబాటు చేసుకోక తప్పదనే రూమర్ ఉంది.

ఇక థియేటర్స్ కూడా చాలా వరకు వారి చేతిలోనే ఉన్నాయనే కామెంట్స్ నిత్యం వినిపించేవే. ఇకపోతే ఇప్పుడు ఒక విషయం హాట్ టాపిక్  గా మారింది. అల్లు అరవింద్ ఇన్నేళ్ళలో సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవలకు సరైన గుర్తింపు గౌరవం లభించలేదని, పద్మ శ్రీ ఇవ్వాలని రీసెంట్ గా అల్లు అర్జున్ తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పడం మీడియాలో వైరల్ గా మారింది.అలాగే మెగాస్టార్ కూడా సూపర్ స్టార్ కృష్ణ గారికి దాదా సాహెబ్ ఇవ్వాలని సరిలేరు నీకెవ్వరు ఈవెంట్ లో చెప్పిన విషయం తెలిసిందే.

వారు అడగడం బాగానే ఉంది గాని.. అవార్డులు.. గౌరవం.. అడిగితే ఇచ్చేస్తారా అనేది మరికొందరి వాదన. ఇద్దరు స్టార్ హీరోలు అయినప్పటికీ గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తే ఎంతవరకు పట్టించుకుంటారు అనేది అందరిలో మెదులుతున్నప్రశ్న. మరీ వారి విన్నపాలకు ప్రభుత్వం ఎప్పటికి నెరవేరుస్తుందో చూడాలి. ఇక అల వైకుంఠపురములో సినిమా జనవరి 12న రిలీజ్ అవుతుండగా.. సరిలేరు నీకెవ్వరు చిత్రం జనవరి 11న విడుదల కాబోతోంది.

అయ్యో సునీల్.. ఒక్క డైలాగ్ కూడా లేదే!