ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసిన పాన్ ఇండియా అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. చిత్ర పరిశ్రమలో భాషాంతరలు తగ్గిపోయిన తర్వాత తెలుగు సినిమా బాలీవుడ్ ఆడియన్స్ కి కూడా వివిధ ఫ్లాట్ ఫామ్స్ లో రీచ్ అవుతోంది. దర్శకులు, నటులు కూడా పాన్ ఇండియా చిత్రాల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. బాహుబలి తర్వాత మల్టీ లాంగ్వేజ్ చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. 

తెలుగుతో పాటు మళయాళంలో కూడా మంచి క్రేజ్ ఉన్న నటుడు అల్లు అర్జున్. రీసెంట్ గా అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రంలో సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్నాడు. త్రివిక్రమ్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డులు సృష్టించింది. 

ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రంపై కన్నేసినట్లు ఉన్నాడు. అల వైకుంఠపురములో చిత్రం విజయం సాధించిన తర్వాత జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. బాలీవుడ్ రంగప్రవేశం గురించి కూడా ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యాడు. అంతే కాదు ముంబైలో ఏకంగా ఓ ఇల్లు కొనుగోలు చేశాడు. ఇదంతా చూస్తుంటే త్వరలో బన్నీ బాలీవుడ్ చిత్రంలో నటించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి అల్లు అర్జున్ మాట్లాడాడు. ముంబైలో తాను ఇల్లు కొన్న సంగతి వాస్తవమే అని అల్లు అర్జున్ తెలిపాడు. తాను బాలీవుడ్ లో చిత్రాల్లో నటించడానికి, ఇల్లు కొనడానికి సంబంధం లేదని తెలిపాడు. హైదరాబాద్ తర్వాత నాకు నచ్చిన నగరం ముంబై. ఇక్కడకు వచ్చినప్పుడు స్టే చేసేందుకు వీలుగా ఇల్లు కొన్నా అని తెలిపాడు. 

చిరంజీవిని చూసే విలువలు పాటిస్తున్నాం.. పవన్ తో సినిమాపై బన్నీ కామెంట్స్!

స్టైట్ బాలీవుడ్ చిత్రంలో నటించాలని తనకూ ఉందని అల్లు అర్జున్ తెలిపాడు. ఆ దిశగా ప్రస్తుతానికి బలమైన అడుగులు పడలేదని, అవకాశం వస్తే నటిస్తానని తెలిపాడు. సౌత్ లో కమర్షియల్ చిత్రాలు ఎక్కువగా తెరకెక్కుతుంటాయి. బాలీవుడ్ లో ప్రస్తుతం కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రాలు ఎక్కువని అల్లు అర్జున్ పేర్కొన్నాడు.