అల వైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ మరో క్రేజీ చిత్రానికి రెడీ అవుతున్నాడు. విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతి అందించే సుకుమార్ దర్శత్వంలో బన్నీ మూడోసారి నటిస్తున్నాడు. రంగస్థలం తర్వాత సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇదే కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

ఈ చిత్ర కథ, కథనాలు, బన్నీ లుక్ అన్ని అంశాల్లో సుకుమార్ వైవిధ్యాన్ని ప్రదర్శించబోతున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. కాబట్టి ఎక్కువగా భాగం అడవుల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలి. ఆంధ్ర, కేరళ రాష్ట్రాల్లో కొన్ని అటవీ ప్రాంతాలని షూటింగ్ లొకేషన్స్ గా సుకుమార్ ఎంచుకున్నారు. 

ముందుగా కేరళలో 40 రోజుల పాటు లాంగ్ షెడ్యూల్ జరగనుంది. అటవీ ప్రాంతం కావడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. సుకుమార్ ఇప్పటికే షూటింగ్ లొకేషన్స్ ని పలుమార్లు పరిశీలించారు. అంతా ఓకే అనుకున్న తర్వాతే లొకేషన్స్ ని ఫైనలైజ్ చేశారు. 

రూ.5 కోట్లు ఎగవేత.. నటుడు ప్రకాష్ రాజ్ పై కేసు!

మార్చి మూడవ వారంలో ఈ షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. బన్నీ సరసన ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.