మంచు మనోజ్ కెరీర్ లో గ్యాప్ వచ్చింది. 2017లో విడుదలైన ఒక్కడు మిగిలాడు మనోజ్ నటించిన చివరి చిత్రం. మనోజ్ నటించిన చిత్రాలు వరుసగా పరాజయం చెందాయి. అదే సమయంలో మనోజ్ పర్సనల్ లైఫ్ లో కూడా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. దీనితో మనోజ్ సినిమాల నుంచి కొంత గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం మనోజ్ తిరిగి తన కెరీర్ ని ఘనంగా ప్రారంభించే పనిలో ఉన్నాడు. 

మనోజ్ నటిస్తున్న తాజా చిత్రం అహం బ్రహ్మాస్మి. మనోజ్ సొంతంగా ప్రొడక్షన్ స్థాపించి చేస్తున్న చిత్రం ఇది. మంచు మనోజ్ బాడీ లాగ్వేజ్, నటనకు అభిమానులు ఉన్నారు. ఒక మంచి చిత్రం పడితే మనోజ్ కెరీర్ తిరిగి పుంజుకుంటుంది అని చెప్పడంలో  సందేహం లేదు. బుధవారం రోజు ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని లాంచ్ చేశాడు. ఈ చిత్రంలో మనోజ్ శివ భక్తుడిగా, అఘోరాలా మనోజ్ కనిపిస్తున్నాడు. ఫస్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 

శివాత్మిక రాజశేఖర్ ఫోటోస్.. నడుము సొగసుతో ఎలా మాయ చేస్తోందో చూశారా

ఇక ఈ చిత్ర షూటింగ్ ని ప్రారంభించడానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. శ్రీకాంత్ రెడ్డి దర్శత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం మార్చి 6 శుక్రవారం రోజున ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిథిగా హాజరు కాబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. 

 

మనోజ్ స్వయంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేశాడు. తాన్ స్నేహితుడు రాంచరణ్ రాబోతున్నట్లు మనోజ్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. స్నేహితుల వల్ల సంతోషాలు మరింత ఎక్కువవుతాయి... కష్టాలు తగ్గుతాయి. అలాంటి నిజమైన స్నేహితుడు రాంచరణ్. నా ఫస్ట్ ప్రొడక్షన్ లో తెరకెక్కబోతున్న అహం బ్రహ్మాస్మి చిత్ర ఓపెనింగ్ కు రాంచరణ్ అతిథిగా రాబోతున్నాడు. ఈ విషయాన్ని మీ అందరికి సంతోషంగా ప్రకటిస్తున్నా అని మంచు మనోజ్ పేర్కొన్నాడు.