స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్ర మ్యూజికల్ కన్సర్ట్ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడారు. సింపుల్ గా మూడు ముక్కల్లో తన ప్రసంగాన్ని ముగించారు. 

తమన్ గత ఏడాది తనకు ప్రతి రోజూ పండగే చిత్రంతో గుడ్ బై  చెప్పాడు. 2020లో అల వైకుంఠపురములో చిత్రంతో వెల్ కమ్ చెప్పాడు అని అరవింద్ అన్నారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రం ప్రారంభం కావడానికి  ముందు చాలా చిన్న కథ చెప్పారని అన్నారు. ఆ చిన్న కథనే ఇంత పెద్ద సినిమాగా మలిచారు అని అరవింద్ అన్నారు. 

అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలన్నీ రాధాకృష్ణే చూసుకున్నారని అన్నారు.  అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కు రెడీ అవుతోంది.

పదేళ్ల తర్వాత వస్తున్నా.. ఇంతకంటే మంచి సినిమా దొరకదు: టబు

అల్లు అర్జున్ కి జోడిగా పూజ హెగ్డే నటించింది. సుశాంత్, నివేత పేతురాజ్, టబు, మురళి శర్మ, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. తమన్ అందించిన సంగీతం ఇప్పటికే సంచలనం సృష్టించింది.