Asianet News TeluguAsianet News Telugu

'పెద్దలకు మాత్రమే' టైప్ సినిమాతో రవిబాబు!

వీలైనంత వేగంగా సినిమాను పూర్తిచేసి వేసవికి సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. యువతరానికి సంబంధించిన ఓ సమస్యను ఈ చిత్రంలో చర్చించనున్నారట. 

Allari Ravi Babu's latest movie titled Crush
Author
Hyderabad, First Published Jan 2, 2020, 9:52 AM IST

బూతులోనే హిట్ ఉందని అల్లరి రవిబాబు సైతం నమ్ముతున్నట్లున్నాడు. తను వరసగా చేసిన సినిమాలు ఏవీ ఆడకపోవటంతో.. ఓ అడల్ట్ కామెడీకు రంగం సిద్దం చేస్తున్నాడు. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై స్వీయ నిర్మాణంలో ఆయన క్రష్ అనే చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధమవుతున్నారు. చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈనెల 24 నుండి ఈ సినిమా ప్రారంభం కానుందని యూనిట్ తెలియజేసింది.

మెగాస్టార్ 152: స్ట్రాంగ్ క్యారెక్టర్ కోసం రాములమ్మ?

వీలైనంత వేగంగా సినిమాను పూర్తిచేసి వేసవికి సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. యువతరానికి సంబంధించిన ఓ సమస్యను ఈ చిత్రంలో చర్చించనున్నారట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక జరుగుతోంది. త్వరలో అన్ని వివరాలు ప్రకటిస్తామని యూనిట్ తెలియజేసింది. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథనాలు ఎంచుకునే రవిబాబు ఈసారి యుత్ ని టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.  
 
. ‘‘యువతృ ఆలోచనలకి అద్దం   పట్టే కథ ఇది. జనవరి 24 నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభిస్తాం. వేసవిలో విడుదల చేస్తాం’’ అని రవిబాబు తెలిపాయి. ఇందులోని నటీనటులు,టెక్నీషియన్స్ టీమ్   వివరాల్ని త్వరలోనే ప్రకటించనున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios