మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా షూటింగ్ మరికొన్ని రోజుల్లో పట్టాలెక్కబోతున్న విషయం తెలిసిందే. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ చిత్రంప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు ఎండ్ అయ్యాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా మెగాస్టార్ సరికొత్త గెటప్ తో దర్శనమివ్వనున్నాడు. మెయిన్ గా నక్సలైట్ గా మెగాస్టార్ బిగ్ స్క్రీన్ పై తన అసలైన నట విశ్వరూపాన్ని చూపించనున్నట్లు తెలుస్తోంది.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమాకు సంబందించిన ఒక గాసిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొరటాల ఒక ముఖ్యమైన పాత్ర కోసం విజయశాంతిని సంప్రదించినట్లు టాక్ వస్తోంది. సినిమా సెకండ్ హాఫ్ లో కథను మలుపు తిప్పే ఒక బలమైన పాత్ర కోసం ఒక స్ట్రాంగ్ లేడి క్యారెక్టర్ అవసరం పడిందట. దీంతో విజయశాంతి అయితే బెటర్ అని చిత్ర యూనిట్ సభ్యులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అప్పట్లో హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జోడి మల్లి బిగ్ స్క్రీన్ పై ఎలా కనిపిస్తారో చూడాలి. చాలా కాలం తరువాత మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతికి ఆఫర్స్ గట్టిగానే వస్తున్నాయట. కానీ ఆమె కేవలం తనకు సెట్టయ్యే పాత్రలను మాత్రమే ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంద. సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.