యువత నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు అన్ని వర్గాల ప్రేక్షకులని కట్టిపడేయడంలో త్రివిక్రమ్ దిట్ట. మాటలతో మాయ చేస్తూనే తన చిత్రాలని కమర్షియల్ పంథాలో నడిపిస్తారు. అందుకే త్రివిక్రమ్ చిత్రాలకు అనకాపల్లి నుంచి అమెరికా వరకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. 

త్రివిక్రమ్ చివరగా తెరకెక్కించిన చిత్రం అల వైకుంఠపురములో టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేయబోతున్నారు. ఇటీవల ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. పొలిటికల్ కాన్సెప్ట్ తో తెరకెక్కే ఈ చిత్రానికి ' అయినను పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

తాజాగా ఈ చిత్రం క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ గా సీత పాత్రలో నటిస్తోంది. అలియా భట్ ని ఎన్టీఆర్ కు హీరోయిన్ గా త్రివిక్రమ్ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

టాలీవుడ్ లో మరో ఇలియానా.. వైరల్ అవుతున్న నభా నడుము అందాలు!

దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. హారిక అండ్ హాసిని, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా ఎన్టీఆర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.