జబర్దస్త్ నటుడు సుడిగాలి సుధీర్ టాలీవుడ్ లో హీరో అయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మొదటి ప్రయత్నంలో సుధీర్ 'సాఫ్ట్ వేర్ సుధీర్' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సుధీర్ సరసన ధన్య బాలకృష్ణ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

సుధీర్ ప్రస్తుతం ఈ చిత్ర ప్రచార కార్యకమాల్లో బిజీగా గడుపుతున్నాడు. తాజాగా సుధీర్ కమెడియన్ అలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఓ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యాడు. ఈ ప్రోగ్రాంకు సంబంధించిన ప్రోమో తాజాగా బయటకు వచ్చింది. సుధీర్ ఎక్కడకు వెళ్లినా యాంకర్ రష్మీ గురించి ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది. 

సోషల్ మీడియాలో అయితే సుధీర్, రష్మీ గురించి ఎలాంటి ప్రచారాలు జరుగుతున్నాయో అందరికి తెలిసిందే. తమ రిలేషన్ షిప్ గురించి ఎన్ని పుకార్లు వచ్చినా సుధీర్, రష్మీ వాటిని ఖండిస్తూ వచ్చారు. తమ మధ్య ఉన్నది కేవలం ప్రొఫెషనల్ రిలేషన్ షిప్ మాత్రమే అని చెప్పుకుంటూ వచ్చారు. 

తాజాగా అలీ కూడా సుధీర్ ని రష్మీ గురించి సరదాగా ప్రశ్నించాడు. ఒకవైపు దీపికా పదుకొనె, మరోవైపు ప్రియాంక చోప్రా ఉన్నారు. వారిద్దరిలో ఒకరినే హగ్ చేసుకునే అవకాశం వస్తే ఎవరిని ఎంచుకుంటావు అని అలీ ప్రశ్నించగా.. రష్మీ ఎక్కడ అని అడుగుతానని సుధీర్ సరదాగా సమాధానం ఇచ్చాడు. 

నువ్వు చాలా ఎదిగిపోయావ్ అంటూ అలీ కూడా ఫన్నీగా బదులిచ్చాడు. ఎక్కడకు వెళ్లినా సుధీర్, రష్మీ అని మీ ఇద్దరి పేర్లు వినిపిస్తుంటాయి. నిజంగానే మీరు మధ్య ఎఫైర్ సాగుతోందా లేక నటిస్తున్నారా అని అలీ ప్రశ్నించాడు. 

సుధీర్ సమాధానం ఇస్తూ.. 7 ఏళ్ల నుంచి రష్మీతో జర్నీ చేస్తున్నా. జబర్దస్త్ లో రష్మీ మీద ఎక్కువగా పంచ్ లు వేసేవాడిని. ఢీలో మా ఇద్దరి అల్లరి మరింతగా ఎక్కువైంది అని సుధీర్ తెలిపాడు. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 9న ప్రసారం కాబోతోంది.