బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తున్న కథానాయికల్లో అలియా భట్ ఒకరు. గ్లామర్ తోనే కాకుండా నటనతో కూడా బాలీవుడ్ ఆడియెన్స్ ని ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మపై నిత్యమా ఎదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. గత కొంత కాలంగా అలియా భట్ రన్ వీర్ తో ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ జోడి బ్రహ్మాస్త్ర అనే సినిమాలో కలిసి నటిస్తోంది. ఓ వైపు సినీ కెరీర్ ట్రాక్ తప్పకుండా పర్సనల్ లైఫ్ లవ్ స్టోరీని కూడా సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది. బేబీ RRR సినిమాలో రామ్ చరణ్ కి జంటగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అసలు మ్యాటర్ లోకి వస్తే..బేబీ 2020లోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు టాక్ వస్తోంది. అసలైతే ఇదే ఏడాది అలియా తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అసలు సమస్య అదేనా..?

పలు ఇంటర్వ్యూలలో ఈ రూమర్స్ పై ఈ లవ్ బర్డ్స్ నవ్వుకున్నారు కూడా. దానికి సమయం ఉందని చెబుతూ ప్రతిసారి తప్పించుకుంటూ వస్తున్నారు.  ఆ మధ్య ఇద్దరికి గొడవలు అయ్యాయని కూడా టాక్ వచ్చింది. ఇకపోతే రూమర్స్ కి తావివ్వకుండా వచ్చే ఏడాది వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలని RRR హీరోయిన్స్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

రణ్ బీర్ కూడా ఈ విషయంపై పాజిటివ్ గా స్పందించినట్లు సమాచారం. విదేశాల్లో పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లు టాక్ వస్తోంది. మరి ఈ పెళ్లి వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.