స్టార్ హీరోయిన్ అలియాభట్ వరుస హిట్ సినిమాలతో బాలీవుడ్ లో దూసుకుపోతుంది. ఇప్పుడు రాజమౌళి 'RRR' సినిమాతో టాలీవుడ్ కి పరిచయం కానుంది ఈ బ్యూటీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అలియా.. తనకు సింపుల్ గా ఉండడం ఇష్టమని.. ఎక్కువ ఖర్చులు చేయడం నచ్చదని అన్నారు. 

టీనేజర్ గా ఉన్నప్పటి నుండే ఖరీదైన వస్తువులు కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. అయితే తనకు హ్యాండ్ బ్యాగ్స్, వ్యాయామం చేసేప్పుడు వేసుకునే బట్టలంటే చాలా ఇష్టమని.. వాటికోసం మాత్రం డబ్బులు ఖర్చు చేస్తానని చెప్పారు. కానీ హాలిడే ట్రిప్స్ కి వెళ్లినప్పుడు తనకు షాపింగ్ చేయడం నచ్చదని చెప్పారు.

సాహో బ్యూటీ.. ఇలా పిచ్చెక్కిస్తే ఎలా?

కాగా.. తన మొదటి సంపాదనతో ఖరీదైన 'లూయిస్ వుట్టన్' హ్యాండ్ బ్యాగ్ ని మొదటిసారి కొనుగోలు చేసినట్లు అలియా వెల్లడించింది. ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన 2019 అత్యధికంగా సంపాదించిన నటుల జాబితాలో అలియా టాప్ లిస్ట్ లో ఉన్న సంగతి తెలిసిందే.

తనకు విలాసవంతమైన ప్రైవేట్ జెట్ తో పాటు పర్వతాల మధ్య ఒక ఇల్లు కట్టుకోవాలని ఉందని.. భవిష్యత్తులో కచ్చితంగా వాటిని నెరవేర్చుకుంటానని చెప్పారు. అదే విధంగా లండన్ లో ఒక ఇంటిని కొనాలన్న తన కలను నెరవేర్చుకున్నానని చెప్పారు. 2018లో కోవెంట్ గార్డెన్ లో ఓ ఇంటిని కొనుగోలు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం తన సోదరి ఆ ఇంట్లో నివసిస్తోందని చెప్పారు.