నాగార్జున, హౌస్ లో ఉన్న ఫైనలిస్టుల మధ్య సంభాషణ ప్రారంభమైంది. క్రమంగా షో రసవత్తరంగా మారుతోంది. చివరి సారి అన్నట్లుగా నాగ్.. ఐదుగురు సభ్యులని తమకు హౌస్ లో ఇష్టమైన ప్రదేశాల గురించి వివరించమని అడిగారు. దీనితో ముందుగా శ్రీముఖి కోర్టు యార్డ్ కు వెళ్ళింది. 

తనకు కోర్టు యార్డ్ అందుకు ఇష్టమో శ్రీముఖి వివరించింది. ఈ ప్రదేశం నుంచే మా అమ్మ హౌస్ లోకి వచ్చింది. అందుకే కోర్టు యార్డ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక ఇక మేమంతా కలసి చాలా పంచాయితీలు కూడా పెట్టుకున్నాం. ఈ కోర్టు యార్డ్ తో తనకు చాలా మెమొరీస్ ఉన్నాయని శ్రీముఖి తెలిపింది. 

ఇక రాహుల్ తనకు ఇష్టమైన ప్రదేశంగా బాత్రూంని ఎంచుకున్నాడు. బాబా భాస్కర్ కిచెన్, అలీ రెజా జిమ్ ఏరియా, వరుణ్ సందేశ్ ఇంటి బయట ఉన్న సోఫా పేర్లు చెప్పారు. బాబా కిచెన్ అంటే నాకు ఇష్టం అని చెప్పాగ్గానే మాకు తెలుసులే అని నాగ్ ఫన్నీగా అనడం నవ్వులు పూయించింది.