బన్నీ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అల వైకుంఠపురములో..’. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవుతుతోంది.   ఇప్పటికే చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్‌ లుక్‌, బన్నీ డైలాగ్‌, ‘సామజవరగమన’సాంగ్‌, పోస్టర్‌ ఈ సినిమాపై హైప్‌ను క్రియేట్‌ చేశాయి. ఈ నేపధ్యంలో గత కొంతకాలంగా ఈ చిత్రం కథ ఫలానా అయ్యి ఉంటుందంటూ చర్చ మొదలైంది. తాజాగా ఈ సినిమా అలనాటి క్లాసిక్ ఎన్టీఆర్ ఇంటిగుట్టు ఆధారంగా రూపొందింది అంటూ వార్తలు మొదలయ్యాయి.

ఈ నేపధ్యంలో అందరూ ఇంటిగుట్టు సినిమా కోసం యూట్యూబ్ లో వెతుకులాట మొదలైంది.ఇంటిగుట్టు టైటిల్ తో టాలీవుడ్ లో రెండు సినిమాలొచ్చాయి. ఒకటి చిరంజీవిది కాగా మరకొటి.. ఎన్టీఆర్- సావిత్రి  జంటగా అలనాటి ప్రముఖ దర్శకుడు వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన క్లాసిక్ మూవీ. 1958లో రిలీజైన ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. ఈ సినిమా స్టోరీ లైన్ ని తీసుకుని ఇప్పటి జనరేషన్ కు తగ్గ కథను అల్లుకుని `అల వైకుంఠపురములో` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

విషయం తేల్చకుండా.. ఈ నసేంటి నాగబాబు..!

ఆ స్టోరీలైన్ ప్రకారం  ఒకే సమయంలో వేర్వేరు తల్లులకు జన్మించిన ఇద్దరు మగ బిడ్డలు అటు ఇటు తారుమారు అయితే ఆ తర్వాత తలెత్తిన పరిణామాలు చుట్టూ కథ జరుగుతుంది. బన్ని, సుశాంత్ లు తారుమారు అయితే జరిగే ఆసక్తికరమైన కథ ఇది అంటున్నారు. అయితే ఇలాంటి డ్రామాలకు ఈ కాలంలో ఆదరణ ఉంటుందా...త్రివిక్రమ్ కు ఆ మాత్రం తెలియదా, ఇది రూమరే  అని కొందరంటున్నారు. అయితే స్టార్ సీన్ లోకి వస్తే పాత,కొత్త తేడా ఉండదు. స్క్రీన్ ప్లే తో స్టార్ మ్యాజిక్ చేస్తే అదిరిపోతుందని మరికొందరంటున్నారు. ఏదైమైనా ట్రైలర్ రిలీజైతే కానీ క్లారిటీ రాదు.

 ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. సుశాంత్, నివేదా పేతురాజ్, జయరామ్, టబు కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు.త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను గీతాఆర్ట్స్‌, హారికా హాసిని క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు.