Asianet News TeluguAsianet News Telugu

భారీ రేటుకి 'అల వైకుంఠపురములో' హిందీ రీమేక్ రైట్స్!

అందుతున్న సమాచారం మేరకు క‌బీర్ సింగ్ నిర్మాత అశ్విన్ వ‌ర్ధే 8 కోట్ల‌తో అల వైకుంఠ‌పుర‌ములో చిత్ర రీమేక్ రైట్స్ ద‌క్కించుకున్నాడు. త్వ‌ర‌లోనే హిందీ వ‌ర్షెన్‌కి సంబంధించిన ప్రారంభం కానున్నాయి. 

Ala Vaikunthapurramuloo's hindi remake rights for 8 cr
Author
Hyderabad, First Published Feb 8, 2020, 11:15 AM IST

హిందీ వాళ్లు మన సినిమాలు..వాళ్ల సినిమాలు మనం రీమేక్ లు చేసుకుంటూ చాలా కాలాంగా కాలక్షేపం చేస్తున్నాం. ముఖ్యంగా మన సౌత్ లో ఓ సినిమా హిట్ అయ్యిందంటే బాలీవుడ్ నిర్మాతలు ఎగబడి ఎంత రేటైనా పెట్టి కొనేస్తున్నారు. అలాగే తాజాగా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్ లో వచ్చి విజయవంతమైన 'అల వైకుంఠపురములో' చిత్రం రీమేక్ రైట్స్ తీసుకున్నట్లు సమాచారం. అర్జున్ రెడ్డి చిత్రాన్ని కబీర్ సింగ్ గా రీమేక్ చేసి ఘన విజయం సాధించిన నిర్మాతే ఈ చిత్రం హిందీ రైట్స్ ని తీసుకున్నట్లు బాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది.

అందుతున్న సమాచారం మేరకు క‌బీర్ సింగ్ నిర్మాత అశ్విన్ వ‌ర్ధే 8 కోట్ల‌తో అల వైకుంఠ‌పుర‌ములో చిత్ర రీమేక్ రైట్స్ ద‌క్కించుకున్నాడు. త్వ‌ర‌లోనే హిందీ వ‌ర్షెన్‌కి సంబంధించిన ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం కాస్ట్ అండ్ క్రూ ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఆ వివ‌రాలు అతి త్వరలో వెల్ల‌డించ‌నున్న‌ట్టు అశ్విన్ తెలిపాడు.  

నితిన్ పెళ్లి వాయిదా వేయబోతున్నాడా..?

ఇక  'అల వైకుంఠపురములో' ..జనవరి 12న విడుదలైన ఈ సినిమా దర్బార్‌, సరిలేరు నీకెవ్వరు మూవీలతో తలపడుతూ దీటైన వసూళ్లను రాబట్టింది. పెద్ద పండగ అయ్యిపోయాక  సైతం అల వైకుంఠపురంలో నూరు శాతం ఆక్యుపెన్సీని నమోదు చేస్తూ సినీ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. అల వైకుంఠపురం గ్లోబల్‌ థియేట్రికల్‌ హక్కులు రూ 85 కోట్లకు అమ్ముడుపోగా దాదాపు అందరూ లాభాల బాట పట్టారు.

ఈ దక్షిణాది సినిమాలు కలిపి అమెరికా బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్నాయని ప్రముఖ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ వెల్లడించారు. ఇక అమెరికా వీకెండ్‌ బాక్సాఫీస్‌ చార్ట్‌లో మన దేశానికి చెందిన ఐదు సినిమాలు చోటు దక్కించుకోగా, ‘అల.. వైకుంఠపురంలో’ సినిమా టాప్‌లో నిలవడం విశేషం. అందుకే ఆ రేటుకు బాలీవుడ్ నిర్మాత పోటీ పడి మరీ రైట్స్ సొంతం చేసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios