నితిన్ పెళ్లి వాయిదా వేయబోతున్నాడా..?

నితిన్ కూడా ఓ ఇంటర్వ్యూలో ఇదే ఏడాదిలో పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పాడు. ఏప్రిల్ 15న పెళ్లి జరగనున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే పెళ్లి వాయిదా పడిందని సమాచారం. 

Young hero Nithin's Wedding Postponed to Month May

కుర్ర హీరో నితిన్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. షాలిని అనే అమ్మాయిని చాలా ఏళ్లుగా ప్రేమిస్తున్న నితిన్ ఆ విషయాన్ని ఇంట్లో చెప్పి అందరినీ పెళ్లికి ఒప్పించాడు. ఈ ఏడాదిలోనే అతడికి పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించుకున్నారు.

నితిన్ కూడా ఓ ఇంటర్వ్యూలో ఇదే ఏడాదిలో పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పాడు. ఏప్రిల్ 15న పెళ్లి జరగనున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే పెళ్లి వాయిదా పడిందని సమాచారం. పెళ్లి ఏప్రిల్ లో కాకుండా మేలో పెట్టుకుందామని నితిన్ ఇంట్లో వారితో చెప్పినట్లు తెలుస్తోంది.

నడుము సొగసుతో శ్రీయ అందాల విందు.. వైరల్ అవుతున్న హాట్ పిక్స్!

పని ఒత్తిడి కారణంగా ఏప్రిల్ లో పెళ్లి పెట్టుకోలేకపోతున్నట్లు సమాచారం. దుబాయ్ లో పలాజో వర్సాచే హోటల్ లో నితిన్ పెళ్లి జరిపించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే నితిన్ కుటుంబసభ్యులు అన్ని ఏర్పాట్లు చేసేసారు.

ఇప్పుడు మరో నెల రోజులు పెళ్లి వాయిదా వేశారు కాబట్టి దుబాయ్ లో పెళ్లి జరుగుతుందా..? లేక ఇండియాలోనే చేస్తారా..? అనేది తెలియాల్సివుంది. ప్రస్తుతం నితిన్ 'భీష్మ' సినిమాలో నటిస్తున్నాడు.

వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు 'రంగ్ దే' అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు. అలానే నితిన్ లిస్ట్ లో మరో రెండు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios