స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'అల.. వైకుంఠపురములో...' . వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న మూడో సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్‌లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. అయితే అప్పుడే ఈ సినిమాకి సంబంధించిన రివ్యూలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి చాలవా..? 'అల.. వైకుంఠపురములో' చూడడానికి!

ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూటర్ లు కొందరు సినిమాని చూడడంతో అక్కడ నుండి సినిమా టాక్ బయటకి వచ్చింది. ఫస్ట్ హాఫ్ లో త్రివిక్రమ్ మార్క్ ఎలివేషన్ సీన్స్, అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజన్స్, డాన్స్ అధ్బుతంగా ఉన్నాయని.. ఇంటర్వల్ బ్యాంగ్ సినిమాకి హైలైట్ గా నిలిచిందని.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి మరో హైలైట్ అని చెబుతున్నారు.

సెకండ్ హాఫ్ లో అల్లు అర్జున్ మాస్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకి మరో హైలైట్ అని అంటున్నారు. క్లైమాక్స్ కూడా మెప్పిస్తుందని టాక్. పండగ కానుకగా రాబోతున్న ఈ సినిమా బన్నీ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పిస్తుందని చెబుతున్నారు. మరి కాసేపట్లో సినిమా ప్రీమియర్ షోలను ప్రదర్శించనున్నారు. సో.. కొన్ని గంటల్లో సినిమా టాక్ బయటకి రానుంది.