దర్శకుడు త్రివిక్రమ్ కి మాటల మాంత్రికుడు అనే పేరు ఊరికేం రాలేదు. త్రివిక్రమ్ రైటర్ గా పని చేస్తున్నప్పటి నుండి తన డైలాగ్స్ తో అలరిస్తూనే ఉన్నాడు. యూట్యూబ్ లో, గూగుల్ లో త్రివిక్రమ్ బెస్ట్ డైలాగ్స్ అని కొడితే వందల కొద్దీ వచ్చి పడతాయి.

త్రివిక్రమ్ రాసే మాటలు.. ఎంతో ఆలోచనాత్మకంగా ఉంటాయి. ఆయన అంతమంది అభిమానులు ఉండడానికి కారణం ఆ డైలాగ్సే.. 2018లో వచ్చిన 'అరవింద సమేత'లో కూడా తన పెన్ పవర్ ఏంటో చూపించాడు త్రివిక్రమ్. ఇప్పుడు తన స్టైల్ లో 'అల.. వైకుంఠపురములో' సినిమాకి డైలాగ్స్ రాశాడు.

గ్యాప్ తీసుకుంటే ఎవరితోనో వెళ్లిపోయానని అన్నారు.. నటి అంజలి కామెంట్స్!

తాజాగా రిలీజైన ట్రైలర్ లో డైలాగ్స్ జనాలను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రెండు డైలాగులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి 'ఈ ప్రపంచంలో దేన్నయినా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది సార్. ఒకటి నేలకి, రెండోది వాళ్లకి. అలాంటోళ్లతో మనకు గొడవేంటి సార్. సరెండైరైపోవాలంతే'. ఒక్క డైలాగ్ లో ఆడవాళ్ల గొప్పదనం గురించి చెప్పడం త్రివిక్రమ్ కే చెల్లింది.

ఈ డైలాగ్ కి జనాలు ఫిదా అయిపోతున్నారు. అలానే మరో డైలాగ్ ''గ్రేటెస్ట్ బ్యాటిల్స్ ఆర్ విత్ క్లోజెస్ట్ పీపుల్.. గొప్ప యుద్ధాలన్నీ నా అనుకున్న వాళ్లతోనే''. ఈ డైలాగ్ ట్రైలర్ కి హైలైట్ గా నిలిచింది.

ఈ రెండు డైలాగ్స్ కూడా కోట్ లాగా పెట్టుకోవచ్చంటూ త్రివిక్రమ్ ని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ట్రైలర్ లో డైలాగ్స్ ఈ రేంజ్ లో ఉంటే సినిమాలో మరిన్ని డైలాగులు ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు.