తెలుగు సినిమా దుబాయ్ సెన్సార్ కు ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే అక్కడ నుండే సినిమా ఎలా ఉండబోతుందనే విషయం ముందుగా బయటకి వస్తుంటుంది. కొందరు ఔత్సాహికులు సినిమా టాక్ ని ట్విట్టర్ లో పెడుతుంటారు. కొన్నిసార్లు వారు చెప్పింది నిజమవుతూ వుంటుంది.

కొన్నిసార్లు ఢమాల్ మంటుంది. అసలు విషయానికి వస్తే.. పండగకి పోటాపోటీగా వస్తున్న సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాలు రెండూ కూడా దుబాయ్ లో సెన్సార్ పూర్తి చేసుకున్నాయి. దాంతో టాలీవుడ్ నుండి దుబాయ్ సెన్సార్ టాక్ మీద ఎంక్వైరీలు మొదలయ్యాయి.

‘సరిలేరు నీకెవ్వరు’ ఫిల్మ్ నగర్ టాక్.. ఆ ఎపిసోడ్స్ కేకే కానీ..

నిజానికి సెన్సార్ అయిందని కొందరు, కాలేదని మరికొందరు అంటున్నారు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం సినిమా సెన్సార్ జరిగిపోయింది. కానీ సెన్సార్ టాక్ ని బయటకి రాకుండా చూసుకుంటున్నట్లు సమాచారం. రెండు సినిమాల ట్రైలర్ లు బయటకి వచ్చాయి. కొందరికి ఈ ట్రైలర్స్ నచ్చితే.. మరికొందరికి పర్వాలేదనిపించాయి.

ట్రైలర్స్ ని పొగిడేవారితో పాటు పెదవి విరిచిన వారు కూడా ఉన్నారు. అయితే సినిమాపై కోట్ల పెట్టుబడులు పెట్టి రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్న వారున్నారు. ఈ క్రమంలో సినిమా సెన్సార్ టాక్ బయటకి వస్తే అనవసరమైన టెన్షన్లు... అందుకే సెన్సార్ కాలేదని.. రేపో, ఎల్లుండో అవుతుందని బయటకి చెబుతున్నారు. అయితే ఓవర్సీస్ లో సినిమాను కొన్నవారికి మాత్రం టాక్ స్ప్రెడ్ అయిందని సమాచారం.