స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'అల.. వైకుంఠపురములో' సినిమా ఆదివారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తొలి షో నుండే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్ల వద్ద జనాలు క్యూ కడుతున్నారు.

ఈ సినిమాకి వచ్చిన క్రేజ్ కి తగ్గట్లే కలెక్షన్స్ లో కూడా ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. కొన్ని చోట్ల ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులు బద్దలు కొడుతోంది. నాలుగు రోజులు పూర్తయ్యే సరికి ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి రూ.56.5 నుండి రూ.59 కోట్ల షేర్ ని రాబట్టినట్లు తెలుస్తోంది.

'సరిలేరు నీకెవ్వరు' లేటెస్ట్ కలెక్షన్స్!

అలానే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.71 కోట్ల నుండి 74 కోట్ల వరకు షేర్ రాబట్టిందని సమాచారం. మల్టీప్లెక్స్ లలో సినిమాకి క్రేజ్ పెరిగిపోతుండడంతో థియేటర్ల సంఖ్య పెంచుతున్నారు.

'సరిలేరు నీకెవ్వరు' సినిమా ఒకరోజు ముందుగానే విడుదలైనా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ పరంగా మాత్రం 'అల.. వైకుంఠపురములో' కలెక్షన్స్ టాప్ రేంజ్ లో ఉందని ట్రేడ్ టాక్. నాల్గో రోజు కూడా ఈ సినిమా దూకుడు ప్రదర్శించింది.

నైజాం, సీడెడ్, వైజాగ్, కృష్ణా, వెస్ట్, గుంటూరు, నెల్లూరు వంటి ఏరియాల్లో ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పట్లో ఈ సినిమాకి బ్రేకులు పడడం కష్టమే..