ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్ పృథ్వీకి బ్రేక్ వచ్చి బిజీ యాక్టర్ గా మారారు. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా గడిపారు. రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత ఈ నటుడు చేసిన కామెంట్స్ కొందరి మనోభావాలను దెబ్బతీశాయి. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి.

అయితే దీని కారణంగా తన సినిమా కెరీర్ పై ఎలాంటి ఎఫెక్ట్ పడదని గతంలో పృథ్వీ అన్నాడు. కానీ పరిస్థితి మాత్రం అలా లేదు. ఈ మధ్యకాలంలో వచ్చిన ఏ సినిమాలో కూడా పృథ్వీ కనిపించలేదు. అల్లు అర్జున్ నటించిన 'అల.. వైకుంఠపురములో' సినిమాలో ముందుగా పృథ్వీ కోసం ఓ రోల్ అనుకున్నాడు త్రివిక్రమ్.

రౌడీ హీరో దశ తిరిగిపోయింది.. విజయ్ దేవరకొండ లగ్జరీ లైఫ్ చూశారా..?

అతడిని సినిమాలోకి తీసుకోవడం కూడా జరిగింది. కానీ బన్నీ మాత్రం పృథ్వీ ఉండడానికి వీల్లేదని చెప్పడంతో అతడిని సినిమా నుండి తొలగించారు. ఇంతకీ పృథ్వీ మిస్ చేసుకున్న రోల్ ఏంటంటే..? సినిమాలో టబుకి సోదరుడిగా కనిపించిన హర్షవర్ధన్ పాత్ర. ముందుగా ఈ రోల్ కోసం పృథ్వీని అనుకున్నప్పటికీ అతడిని తప్పించారు.

దానికి కారణం అతడు జనసేన పార్టీపై, పవన్ పై చేసిన కామెంట్స్ అని తెలుస్తోంది. అయితే ఇప్పుడు సినిమాలో హర్షవర్ధన్ పాత్రకి మంచి అప్లాజ్ వస్తుంది. ఇలాంటి రోల్ వచ్చి ఉంటే పృథ్వీకి మరిన్ని సినిమా అవకాశాలు వచ్చి ఉండేవి.

కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రీసెంట్ గా ఓ మహిళతో పృథ్వీ జరిపిన ఫోన్ కాల్ సంభాషణ వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై మీమ్స్, టిక్ టాక్ కూడా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పృథ్వీకి సినిమా అవకాశాలు రావడం కష్టమే అనిపిస్తుంది.