ఇన్నాళ్లూ తనే అందరితో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ వస్తున్న రామ్ గోపాల్ వర్మ కు సెన్సార్ బోర్డ్ మొదటి సారిగా ట్విస్ట్ఇచ్చింది.  సెన్సార్ తో పెట్టుకుంటే ఏమౌతుందో  తెలిసొచ్చేలా చేసింది. వివాదాస్పద చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల సమయంలో కూడా వర్మకు ఇన్ని సెన్సార్  కష్టాల్లేవు. ఈసారి మాత్రం  ఎటు నుంచి ఎటు వచ్చినా సెన్సార్ తన రూల్స్ తో వర్మను ముప్పు తిప్పలు పెడుతోంది.

ఆయన రెడీ చేసిన రెండు సినిమాల రిలీజ్ లను డైలమాలో పడేసింది.  సెన్సార్ బోర్డ్ పై  రకరకాల  విమర్శలు చేసిన వర్మకు , తమ రూల్స్ ని  ఎలా వాడుకోవాలో, అలా వాడటం మొదలెట్టి సెన్సార్ ఆఫీసర్స్ కంగారుపుట్టిస్తున్నారు. పైగా టైటిల్ మారుస్తానని వర్మ వాలంటరీగా ముందుకొచ్చినా  ఫలితం లేకుండాపోయింది.  కమ్మరాజ్యంలో కడపరెడ్లు  టైటిల్ ని  అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అని మార్చినా సెన్సార్ కరుణించలేదు.

ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ నుంచి బయిటపడేలా లేదు. కోర్టు ఆదేశాల మేరకు సినిమా చూసిన సెన్సార్ అధికారులు, సినిమాకి 90 కట్స్ చెప్పి, రివ్యూ కమిటీకి వెళ్లమంది.  ఇదిలా ఉంటే  వర్మ తాజా చిత్రం బ్యూటిఫుల్ సినిమా విషయంలో కూడా ఇదే తీరు. మొదట ప్రకటించిన దాని ప్రకారం ఈ శుక్రవారం ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేసారు. కానీ సెన్సార్ సభ్యులు మాత్రం సినిమా చూసి, సర్టిఫికేట్ ఇవ్వలేదు. దీంతో వర్మ రిలీజ్ , బిజినెస్ ఆపేసారు. సెన్సార్ తర్వాత చూసుకుందామని మాట్లాడుకుందామని వర్మ డిస్ట్రిబ్యూటర్స్ కు చెప్పారు.

అయితే ఊహించని టైమ్ లో సినిమాకు సెన్సార్ పూర్తిచేసి ఎలాంటి కట్స్ లేకుండా `ఎ` సర్టిఫికెట్ ఇచ్చారు.  దీంతో సెన్సార్ అయినా రిలీజ్ చేయలేని పరిస్థితిలో పడ్డారు వర్మ. ఈ సినిమా కూడా వాయిదాపడింది. దాంతో పబ్లిసిటి మీద పెట్టిన శ్రమ అంతా వృధా అయ్యింది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని టీమ్ పేర్కొంది.   ఇక టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై   బ్యూటిఫుల్  (ట్రిబ్యూట్ టు రంగీలా ఉప శీర్షిక) టైటిల్ తో వర్మ రూపొందించారు.

నైనా హీరోయిన్ గా కాగా సూరి హీరోగా నటించారు. అగస్త్య మంజు దర్శకుడు.  రొమాంటిక్ ప్రేమ కధాంశంతో వైవిధ్య భరితంగా ఈ చిత్రాన్నిమలచడం జరిగింది.  ఈ చిత్రానికి పాటలను సిరా శ్రీ అందించగా...సంగీతాన్ని రవి శంకర్ సమకూర్చారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ, సమర్పణ: టి.అంజయ్య, నిర్మాతలు: టి నరేష్ కుమార్, టి.శ్రీధర్, , రచన, ఫోటోగ్రఫీ, దర్శకత్వం: అగస్త్య మంజు.