స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిగ్ బడ్జెట్ మూవీ "అల.. వైకుంఠపురములో.." సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా సినిమాకు సంబందించిన రెండు పాటలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.  ఇక ఇప్పుడు జనాలను ఆకర్షించేందుకు మరో సాంగ్ ని రెడీ చేశారు.

బాలల దినోత్సవ సందర్బంగా ఆ సాంగ్ టీజర్ ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఫుల్ సాంగ్ ని గురువారం రిలీజ్ చేయనున్నారు. #OMG డాడీ సాంగ్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది. . ఓ మై గాడ్ డాడీ - బ్యాడ్ గా ఉండకు, హార్డ్ గా అస్సలు ఉండకు. అది నన్ను చాలా సాడ్ గా చేస్తుంది" అనే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి.

ఇక సాంగ్ లిరిక్స్ కి తగ్గట్టుగా బన్నీ పిల్లలు - అల్లు అయాన్ - అల్లు ఆర్హ ఇచ్చిన హావభావాలు మంచి హైప్ ని క్రియేట్ చేశాయి. ఇద్దరు కూడా వారి స్టైల్ కి తగ్గట్టుగా అల వైకుంఠపురములో పోస్టర్ ని చూసి తల బాదుకోవడం సరదాగా అనిపిస్తోంది. ఇక ఫుల్ సాంగ్ ని ఈ  నెల 22న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.

Ala Vaikunthapurramuloo : భారీ ధరకి హిందీ డిజిటల్, శాటిలైట్ రైట్స్!

రేపు సాయంత్రం 4:05గంటలకు సాంగ్ ని విడుదల చేయనున్నారు.    థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ - హారిక హాసిని ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సినిమాలో సుశాంత్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా పూజ హెగ్డే - నివేత పేతురాజ్ హీరోయిన్స్ గా కనిపించనున్నారు. 2020 సంక్రాంతికి సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.