స్టైలిష్ స్టార్ స్టార్ అల్లు, మాటల మాత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'అల.. వైకుంఠపురములో'. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో సుశాంత్, టబు, నవదీప్ లాంటి నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇటీవల హైదరాబాద్ లో షూటింగ్ నిర్వహించిన చిత్రబృందం ప్రస్తుతం పారిస్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల ఈ సినిమా నుండి రెండు పాటలను విడుదల చేశారు. ఆ రెండు పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ముదురు భామలతో కుర్ర హీరోలు.. హాట్ రొమాన్స్!

దానికి తగ్గట్లే సినిమా బిజినెస్ కూడా జరుగుతుంది. అల్లు అర్జున్ సినిమాలకు హిందీ డిజిటల్ లో మంచి మార్కెట్ వుంది. అందుకే ఈ సినిమాకి కూడా మంచి రేటు పలికింది.  గతంలో వచ్చిన 'సరైనోడు' వగైరా సినిమాలు హిందీ డిజిటల్ కొనుగోలు దారులకు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి.

అదే నమ్మకంతో ఈ సినిమాకి రూ.19.50 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తానికి హిందీ శాటిలైట్, డబ్బింగ్, డిజిటల్ హక్కులు ఇచ్చేయడానికి ఒప్పదం కుదిరినట్లు సమాచారం.నిజానికి నిర్మాతలు రూ.22 కోట్లు డిమాండ్ చేయగా.. ఫైనల్ గా రూ.19.50 కోట్లకు ఫిక్స్ చేసుకున్నారు.

గతంలో అల్లు అర్జున్ నటించిన 'నా పేరు సూర్య' సినిమాలో తెలుగు, హిందీ శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ మొత్తం కలుపుకొని రూ.23.75 కోట్లకు అమ్మారు. ఆ లెక్కన చూసుకుంటే ఒక్క హిందీ వెర్షన్ రైట్స్ కి రూ.19.50 కోట్లు ఆఫర్ చేయడం విశేషమనే చెప్పాలి. హారిక హాసిన బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.