పవన్‌ కల్యాణ్‌ కు జానపద గీతాలు ఇష్టం కావటంతో .....ఆయన సినిమాల్లో జానపద గీతాలు బాగా వినిపించేవి. తమ్ముడు, ఖుషీ, జాని వంటి సినిమాల్లో వాడిన జానపద గీతాలు బాగా పాపులర్ అయ్యాయి.  ‘తాటిచెట్టెక్కలేవు... తాటికల్లు తెంపలేవు’, ‘బై బైయ్యే బంగారు రవణమ్మ’ వంటి పాటలు థియేటర్లో  ఊపేసాయి. ఇప్పుడు అల్లు అర్జున్ సైతం అదే పంధాని ఫాలో అవుతున్నారు.

‘అల వైకుంఠపురములో’ చిత్రంలోనూ అలాంటి ఓ జానపద గీతాన్ని వినిపించనున్నారు.  ఈ సినిమాలో ఓ పాపులర్ శ్రీకాకుళ జానపద గీతాన్ని వాడుకుంటున్నారట. ఆ పాటని తమన్‌ తనదైన స్టైల్ లో స్వరపరిచారని, ఓ ప్రత్యేకమైన సందర్భంలో ఈ పాట వస్తుందని తెలుస్తోంది. అయితే ఈ పాటని అల్లు అర్జున్ చేత పాడించాలని తమన్ ఆలోచన అని చెప్తున్నారు. మరి బన్నినే ఒప్పుకుని పాడతారా లేక వేరే వాళ్లు పాడతారా అనేది చూడాలి.

ఆ నిర్మాతే నా బ్యాక్ బోన్, హీరోయిన్ గా ఛాన్స్ వస్తే.. యాంకర్ శ్యామల కామెంట్స్!

ఇక ఇప్పటికే ఈ చిత్రంలోని రెండు పాటలు విడుదలయ్యాయి. ‘సామజవరగమన’, ‘రాములో.. రాములా’ రెండూ దుమ్ము దులిపివదిలాయి. త్వరలోనే మరో పాటని విడుదల చేయడానికి సమాయత్తం అవుతోంది చిత్రయూనిట్. అయితే జానపద సాంగ్ ని మాత్రం థియేటర్‌లోనే చూపిస్తారట. జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ  అల వైకుంఠపురములో.. పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతి పండగ కానుకగా ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. మరో ప్రక్క చిత్ర యూనిట్ డబ్బింగ్ కూడా మొదలు పెట్టింది. సుశాంత్, నవదీప్, రావు రమేష్ , మురళీ శర్మ ముఖ్యపాత్రలో కనిపిస్తున్నారు.

ఇక అలనాటి తార టబు ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తోంది. గీతా ఆర్ట్స్, హారిక హాసిని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. బన్ని, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇది మూడవ చిత్రం కాబట్టి సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి.