బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇటీవల న్యూఢిల్లీలోని ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో విలేకరులు అక్షయ్ ని రకరకాల ప్రశ్నలు అడిగారు. వారు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పిన అక్షయ్ తనకు జాతీయ అవార్డు ఫంక్షన్ లో ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పాడు.

తన మొదటి జాతీయ అవార్డు కార్యక్రమంలో ఓ అమ్మాయి కలిసిందట. ఆమె తనకు వీరాభిమానిని అని చెప్పి తన పక్క సీటులోనే కూర్చుందట. అవార్డు గెలుచుకున్నందుకు అభినందనలు కూడా చెప్పిందట. అలానే మీరు ఎన్ని సినిమాలు చేశారు అంటూ అక్షయ్ ని అడిగిందట.

'అమ్మ రాజ్యంలో..' నిర్మాతని వర్మ విసిగిస్తున్నాడా..?

దానికి ఆయన 137 అని సమాధానమిచ్చినట్లు చెప్పారు. అదే ప్రశ్న అక్షయ్ ఆమెని తిరిగి ప్రశ్నిస్తే.. అది తన మొదటి సినిమా అని చెప్పిందని.. మొదటి సినిమాకే జాతీయ అవార్డు అందుకుందని.. ఇక మీరే ఊహించుకోండి నాకు ఎంతటి అవమానం ఎదురై ఉంటుందో అంటూ చమత్కరించాడు అక్షయ్.

ఇది ఇలా ఉండగా.. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా..? అనే ప్రశ్నకి అక్షయ్.. 'నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా.. అందుకే ఎప్పటికీ రాజకీయాల్లోకి అడుగుపెట్టను' అంటూ చెప్పుకొచ్చాడు.

తనకు నటించడమంటే చాలా ఇష్టమని, తన చిత్రాలతో దేశానికి సహకరించాలనుకుంటున్నానని.. అదే తన ఉద్యోగమని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అక్షయ్ బాలీవుడ్ లో కరీనా కపూర్ తో కలిసి 'గుడ్ న్యూస్' అనే సినిమాలో నటిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.